ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం

Last Updated : Oct 28, 2019, 01:45 PM IST
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సమ్మె కారణంగా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు చేపడుతున్న ప్రత్యామ్నాయ చర్యలను పర్యవేక్షిస్తూనే.. ఆర్టీసీలో మరిన్ని అద్దె బస్సులు తీసుకోవాలని నిర్ణయించారు. ఏయే మార్గాల్లో ఎంతమేరకు అవసరాలు ఉన్నాయో పరిశీలించి విధి, విధానాలు రూపొందించాల్సిందిగా సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ కార్మికులు కోరుతున్న డిమాండ్లకు ఇది వ్యతిరేకం కానుంది. ఆర్టీసీలో అద్దె బస్సులను తగ్గించి, ఆర్టీసీనే సొంతంగా బస్సులను కొనుగోలు చేయాలనేది కార్మికులు మొదటి నుంచి కోరుతున్న డిమాండ్లలో ఒకటనే సంగతి తెలిసిందే. 

ఆర్టీసీ సమ్మె, కార్మికులతో చర్చలపై సోమవారం హైకోర్టులో వాదనలు జరగనున్న నేపథ్యంలో శనివారం కార్మికులతో చేపట్టిన చర్చలు విఫలమైన తీరుపై ఆదివారం ప్రగతి భవన్‌లో రవాణా శాఖ మంత్రి, చర్చల్లో పాల్గొన్న ఆర్టీసీ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సోమవారం కోర్టులో ప్రభుత్వం తరపున ఏం వాదనలు వినిపించాలి ? చర్చల సారాంశం ఏంటి అనే అంశాలపైనే ఈ సమీక్షా సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగానే ఆర్టీసీలో అద్దె బస్సులు పెంచాలనే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Trending News