హైదరాబాద్: దేశంలో గుణాత్మక మార్పు తీసుకువచ్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ముందుగా చెప్పినట్లుగానే దేశంలో వివిధ రాజకీయ పార్టీ అధినేతలతో భేటీ అవుతున్నారు. వారితో జాతీయ రాజకీయాలపై చర్చిస్తున్నారు.
ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని కోల్‌కతాకి వెళ్లి కలిశారు. గతవారం బెంగళూరులో మాజీ ప్రధాని దేవేగౌడతో సీఎం కేసీఆర్ సమావేశమై దేశ రాజకీయాలు, రాబోయే ఎన్నికలపై చర్చించారు. ఇక ఇప్పుడు బీజేడీ (బీజు జనతా దళ్) అధినేతతో భేటీ కానున్నారు. మే నెల మొదటి వారంలో ఒడిశా వెళ్లేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. భువనేశ్వర్ లో ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్‌తో సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. ప్రస్తుతం ఒడిశా అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో మే మొదటివారంలో భేటీ కావాలని కేసీఆర్ నిర్ణయించారు. అయితే ఆయన భేటీ అవుతున్న నేతలందరూ ప్రాంతీయపార్టీ అధినేతలే కావడం విశేషం.
Telangana CM K Chandrashekhar Rao to meet Odisha CM Naveen Patnaik in the first week of May. The two leaders will hold a discussion on national politics. pic.twitter.com/2KIssCws4d
— ANI (@ANI) April 17, 2018