Telangana: తెలంగాణ కేబినేట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!

తెలంగాణ మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి ముందే ముగిసింది.

Last Updated : Oct 10, 2020, 11:20 PM IST
    • రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో
    • కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం
    • జీహెచ్ఎంసీ యాక్ట్ సవరణ బిల్లుకు కేబినెట్ అమోదం
Telangana: తెలంగాణ కేబినేట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!

తెలంగాణ ( Telangana ) మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి ముందే ముగిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా జీహెచ్ఎంసీ యాక్ట్ సవరణ బిల్లుకు కేబినెట్ అమోదం తెలిపింది. దాంతో పాటు ఇద్దరికన్నా ఎక్కువ సంతానం ఉంటే పోటీకి అనర్హులు అనే రూల్ తొలగించించేందుకు మంత్రివర్గం నిర్ణయించింది.

Also Read: పెళ్లికి ముందు Virat Kohli డేటింగ్ చేసిన ఆ బ్యూటీస్ ఎవరో తెలుసా?

మంత్రివర్గ సమావేశంలో రానున్న పదేళ్ల పాటు డివిజన్ల వారీగా రిజర్వేషన్లు కొనసాగించే నిర్ణయం కూడా తీసుకున్నారు. కార్పోరేటర్లకు అందించే నిధులను కూడా సవరణ బిల్లులో చేర్చనున్నట్టు సమాచారం. సవరణలతో కూడిన జీహెచ్ఎంసీ ( GHMC ) బిల్లును అక్టోబర్13న జరిగే శాసనసభ సమావేశంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వీటితో పాటు పలు అంశాలపై మంత్రిమండలి చర్చించినట్టు సమాచారం

అందులో కీలకమైన అంశాలు ఇవే..

* గ్రామాల నుంచే ధాన్యం కొనుగోలుకు నిర్ణయం.
* దీని కోసం 6 వేల ధాన్యం సేకరణ కేంద్రాల ఏర్పాటు చేయనున్నారు.
* నాలా చట్టానికి సవరణ చేయాలని నిర్ణయించారు. భూమార్పిడిని సులభతరం చేస్తూ, అధికార దుర్వినియోగం తగ్గించేందుకు ఏర్పాట్లు చేయడానికి నిర్ణయం.
* స్వల్ప సవరణలో రిజిస్ట్రేషన్ చట్టానికి ఆమోదం.

ALSO READ | NEET Results 2020: నీట్ ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితాలు విడుదల తేదీలు ఇవే!  ఇలా చెక్ చేయండి
* జీహెచ్ఎంసీ పాలక మండలిలో మహిళలు 50 శాతం ప్రాతినిధ్యం వహించేలా చట్టంలో సవరణకు కేబినెట్ అంగీకరించింది.
* ఆన్‌లైన్‌లో ఆస్తుల నమోదు గడువు అక్టోబర్ 20 వరకు పెంపు.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News