KTR, Harish Rao : కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై బీఆర్ఎస్ ముఖ్య నేతల కామెంట్స్

KTR, Harish Rao About Karnataka Election Result 2023: కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు తెలంగాణలో త్వరలోనే జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి అనే ఆసక్తి నెలకొని ఉంది. ముఖ్యంగా కర్ణాటక ఫలితాలపై తెలంగాణ అధికార పార్టీ నేతలు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 13, 2023, 07:38 PM IST
KTR, Harish Rao : కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై బీఆర్ఎస్ ముఖ్య నేతల కామెంట్స్

KTR, Harish Rao About Karnataka Election Result 2023: కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు తెలంగాణలో త్వరలోనే జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి అనే ఆసక్తి నెలకొని ఉంది. ముఖ్యంగా కర్ణాటక ఫలితాలపై తెలంగాణ అధికార పార్టీ నేతలు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ... కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణలో జరగబోయే ఎన్నికలపై ప్రభావం చూపించవు అని అన్నారు. 

కేరళ స్టోరీ మూవీ ఎలాగైతే కర్ణాటక ప్రజలను అలరించలేకపోయిందో.. అలాగే కర్ణాటక ఎన్నికల ఫలితాలు కూడా తెలంగాణ ప్రజలపై ప్రభావం చూపించవు అని ట్వీట్ చేశారు. విభజించి పాలించే రాజకీయాలను తిరస్కరించిన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నాను అని మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ ఇంకా ఏమేం అన్నారంటే..

 

 
ఇదిలావుంటే, కర్ణాటక ఎన్నికల ఫలితాలపై మంత్రి హరీశ్ రావు సైతం ట్విటర్ ద్వారా స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు చెబుతూనే తెలంగాణలో బీజేపి పరిస్థితి గురించి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

 

Trending News