BJP BC Declaration: బీసీ డిక్లరేషన్ ప్రకటించిన బీజేపీ.. కేసీఆర్ మూర్ఖుడంటూ బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay Speech at BJP OBC Meeting: రాష్ట్రంలో భజరంగ్ దళ్‌పై నిషేధం విధించేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు బండి సంజయ్. కేంద్రంలో మోదీ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తే.. కేసీఆర్ బీసీలను అడుగడుగునా అవమానిస్తున్నారని విమర్శించారు.  

Written by - Ashok Krindinti | Last Updated : May 18, 2023, 05:09 PM IST
BJP BC Declaration: బీసీ డిక్లరేషన్ ప్రకటించిన బీజేపీ.. కేసీఆర్ మూర్ఖుడంటూ బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay Speech at BJP OBC Meeting: తెలంగాణలో బీసీ డిక్లరేషన్‌ను బీజేపీ ప్రకటించింది. అధికారంలోకి వస్తే బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో కోరల్లేని బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించి అన్ని అధికారాలు అప్పగిస్తామని పేర్కొంది. విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునే బీసీ విద్యార్థులందరికీ పరిమితి లేకుండా స్టాచ్చురేషన్ (సంతృప్తస్థాయి) పద్దతిలో అందరికీ ఆర్దిక సాయం అందిస్తామని ప్రకటించింది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు పెద్ద పీట వేస్తామని, ఎన్నికల్లో పోటీపడలేని, గెలవలేని బీసీల్లోని చిన్న కులాలకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది. శనివారం హైదరాబాద్‌లోని నాగోల్‌లో జరిగిన తెలంగాణ బీజేపీ ఓబీసీ సమ్మేళనం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ సహా పెద్ద ఎత్తున బీసీ ప్రజా ప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ బీసీ డిక్లరేషన్‌ను ప్రవేశపెట్టగా బండి సంజయ్ ఆమోదించారు.  

అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో భజరంగ్ దళ్‌పై నిషేధం విధించేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ విషయంలో కాంగ్రెస్‌తో కేసీఆర్ పోటీ పడుతున్నారని అన్నారు. అదే జరిగితే భారత మాతా కీ జై అంటే జైల్లో వేస్తారని.. జై శ్రీరాం అంటే కేసులు పెట్టి వేధించే రోజులు రాబోతున్నాయన్నారు. ఓబీసీ సమ్మేళనం ఎవరికీ వ్యతిరేకం కాదని.. కేసీఆర్ కుటుంబానికి, కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకని అన్నారు. అగ్రవర్ణ పేదలకు మోదీ ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లు ఇస్తే రెండేళ్లపాటు రాష్ట్రంలో అమలు చేయకుండా అడ్డుకున్న మూర్ఖుడు కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు పెద్ద పీట వేసిన వ్యక్తి మోదీ అని.. 27 మందికి కేబినెట్‌లో చోటు కల్పించారని అన్నారు.  

'రాష్ట్రంలో బీసీలను అడుగడుగునా అవమానించిన వ్యక్తి కేసీఆర్. ఆయనకు తెలంగాణ పాఠాలు నేర్పిన ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, గూడ అంజన్నలను దారుణంగా అవమానించిన మూర్ఖుడు కేసీఆర్. తెలంగాణ జనాభాలో 50 శాతమున్న బీసీలకు కేసీఆర్ చేసిందేమిటి..? గొర్లు, బర్లు, చేపలు ఇచ్చి రాజకీయంగా అణగదొక్కుతున్నారు. 50 శాతం బీసీ జనాభా ఉంటే ముగ్గురికి మాత్రమే కేబినెట్‌లో చోటు కల్పించి మోసం చేసిన మూర్ఖుడు కేసీఆర్. ఒక్కసారి ఆలోచించండి. బీసీ వ్యక్తిని బీజేపీ ప్రధానిని చేసింది. 

రాష్ట్రంలో కేసీఆర్ కుల వృత్తులను దెబ్బతీస్తున్నారు. అవసరం లేకపోయినా 16 వందల కోట్లు ఖర్చు పెట్టి సెక్రటేరియట్, ప్రగతి భవన్ కట్టుకున్న సీఎం.. బీసీ ఆత్మగౌరవ భవనాలను ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారో బీసీ సమాజం గుర్తించాలి. కూలీనాలీ చేసుకుని బతకాల్సిన దుస్థితి బీసీలది. 4 శాతం ముస్లిం రిజర్వేషన్ల వల్ల 32 మంది కార్పొరేటర్ పదవుల్లో హిందువులకు అన్యాయం జరిగింది. ఇప్పుడే తెలిసింది. తెలంగాణలో కూడా భజరంగ్ దళ్‌ను నిషేధించేందుకు కేసీఆర్ ఫ్రభుత్వం సిద్ధమైందట.. దీనిపై చర్చిస్తుందట.. నిషేధిస్తే ఊరుకుందామా..? మనం మౌనంగా ఉంటే భారత మాతా కీ జై అంటూ జైల్లో పెడతారు. జై శ్రీరాం అంటే కేసులు పెడతారు.

కర్ణాకలోని పరిస్థితులు వేరు.. తెలంగాణలోని పరిస్థితులు వేరు.. భాగ్యలక్ష్మీ వద్దకు వెళ్లే దమ్ము కేసీఆర్‌కు లేదు.. ముస్లింల అభివృద్ధి గురించి మాట్లాడిన పార్టీ బీజేపీ. ముస్లిం మహిళల మనోభావాలను కాపాడేందుకు ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేసిన పార్టీ బీజేపీ.. ట్రిపుల్ తలాఖ్‌ను వ్యతిరేకిస్తున్న పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు. పాతబస్తీ ఎందుక అభివృద్ధి కావడం లేదో ముస్లిం ప్రజలంతా కేసీఆర్ పాలకులను నిలదీయాలి. బీజేపీని ముస్లిం వ్యతిరేక బూచిగా చూపిస్తూ లబ్ది పొందాలని చూస్తున్నాయి. పాతబస్తీ వేదికగా ముస్లింకు జరిగిన అన్యాయంపై నేను లెవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పాతబస్తీ ప్రజలు ఇదే విషయంపై నిలదీయాలని కోరుతున్నా..' అని బండి సంజయ్ అన్నారు.

Also Read: Amazon Shopping: అమెజాన్ వినియోగదారులకు షాక్.. ఈ వస్తువులపై ధరల పెంపు..?  

Also Read: Cabinet Meeting: కొత్త సచివాలయంలో తొలిసారి కేబినెట్ మీటింగ్.. కీలక అంశాలపై చర్చ  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News