Telangana Schemes: తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. రేపు నాలుగు పథకాలు ప్రారంభం

Big Good News To Telangana Public Tomorrow Four Schemes Will Launch Check List: భారత రాజ్యాంగం అమలైన రోజును గణతంత్ర దినోత్సవం చేసుకుంటున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు భారీ శుభవార్త వినిపించింది. ఒకే రోజు నాలుగు పథకాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 25, 2025, 08:11 PM IST
Telangana Schemes: తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. రేపు నాలుగు పథకాలు ప్రారంభం

Republic Day Telangana Gift: ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో తాత్సారం చేసిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఎట్టకేలకు కొన్నింటిని నెరవేర్చేందుకు సిద్ధమైంది. అనేక వాయిదాలు.. అనేక నిబంధనలతో కొన్ని పథకాలను అమలుకు శ్రీకారం చుట్టనుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు నాలుగు పథకాలు కానుకగా అందించనుంది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. రేపు ఆ పథకాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరిగాయి.

Also Read: PMAY Houses: కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ 'భారీ' విజ్ఞప్తి.. 'మాకు 20 ల‌క్ష‌ల ఇళ్లు ఇవ్వండి'

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు లాంచనంగా ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. లక్షల్లో దరఖాస్తులు రావడంతో రేపటి నుంచి మార్చి వరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. ఈ నాలుగు పథకాలు రేపు ప్రతి మండలంలో ఒక గ్రామంలో నూరు శాతం అమలు చేస్తామని చెప్పారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తామని పేర్కొన్నారు. భూమిలేని నిరుపేద, ఉపాధి హామీ పథకంలో 20 రోజులపాటు పనిచేసిన వారందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తామని వెల్లడించారు.

Also Read: Ponguleti Srinivasa Reddy: 'వాట్ ఈజ్ దిస్ నాన్సెన్స్‌' అంటూ మహిళా కలెక్టర్‌పై మంత్రి పొంగులేటి నోటి దూల

హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటనలు చేశారు. షెడ్యూల్ ప్రకారం గ్రామసభలు నిర్వహించి దరఖాస్తులు తీసుకొని అర్హులందరికీ లబ్ధి చేకూర్చాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. లక్షలాది సంఖ్యలో వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించి జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఈ సంక్షేమ పథకాల అమలును ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.

ఇచ్చిన మాట మేరకు పథకాలు అమలు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని నూరు శాతం ఆ గ్రామంలో ఈ నాలుగు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వెల్లడించారు. లక్షలాదిగా వచ్చిన దరఖాస్తులను కంప్యూటర్లలో ఎంట్రీ చేసి అర్హులను గుర్తిస్తామని.. మార్చి నెల వరకు ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని స్పష్టత ఇచ్చారు. ప్రతి ఎకరాకు రైతు భరోసా, భూమిలేని పేదలకు, 20 రోజులపాటు ఉపాధి హామీ పనికి వెళ్లిన వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వివరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News