Fire Crackers Blast In Boat: గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన బాణాసంచా పేలుళ్లు ప్రమాదవశాత్తు మరోచోట పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం ఎలాంటిది సంభవించకపోగా.. కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా ఈ ప్రమాదం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో జరగడం గమనార్హం. రాత్రిపూట జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Telangana Schemes: తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. రేపు నాలుగు పథకాలు ప్రారంభం
ప్రతి సంవత్సరం మాదిరి ఈసారి గణతంత్ర దినోత్సవానికి భారతమాత పౌండేషన్ ఆధ్వర్యంలో 'భారత మాత మహా హారతి' కార్యక్రమం నిర్వహిస్తారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్‌లో ఆదివారం భారతమాత మహా హారతి కార్యక్రమం నిర్వహించారు. మహా హారతి కార్యక్రమం ముగిసిన అనంతరం బాణాసంచా పేలుళ్లు చేశారు. ఆకాశంలో తారాజువ్వలు వెలగాల్సి ఉండగా పడవలో పేలిపోయాయి.
Also Read: PMAY Houses: కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ 'భారీ' విజ్ఞప్తి.. 'మాకు 20 లక్షల ఇళ్లు ఇవ్వండి'
మహా హారతి అనంతరం రాత్రి 9.05 గంటల ప్రాంతంలో హుస్సేన్ సాగర్ నుంచి రెండు పడవల్లో బాణసంచా పేల్చారు. ప్రమాదవశాత్తు బాణసంచా పేలి పడవల్లోనే పేలి మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నిర్వాహకులు అతడిని సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. హుస్సేన్ సాగర్‌లో రెండు బోట్లలో ఏర్పాటు చేసిన బాణాసంచా కాలిపోవడంతో బాణాసంచా మెరుపులు కనిపించలేదు. బాణాసంచా పేలుడుతో రెండు బోట్లు కాలిబూడిదయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.