/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Telangana Rains Update: నిన్న మెున్నటివరకు ఉత్తారాదిన ఊపేసిన వానలు.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై కన్నెర్ర జేశాయి. ఎడతెరిపి లేకుండాకురుస్తున్న వర్షాలతో తెలంగాణ విలవిల్లాడుతోంది. కుండపోత వర్షాలకు ముఖ్యంగా నిజామబాద్, వరంగల్ జిల్లాల్లో బీభత్సం సృష్టించాయి. అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌లో సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజామున 3 గంటల వరకు 46.3 సెంటీమీటర్ల రికార్డుస్థాయి వర్షం కురిసింది.  రాష్ట్రవ్యాప్తంగా 4.39 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా 1.05 లక్షల ఎకరాల్లో పంటపొలాలు నీటమునిగాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 

మరో మూడు రోజులు వర్షాలే..
వరుణుడి ధాటికి హైదరాబాద్, నిజామాబాద్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీలు, పంట పొలాలు నీటమునిగాయి. జనజీవనం స్తంభించింది.  మరోవైపు రాబోయే మూడు రోజులు పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాల దృష్ట్యా బుధ, గురువారాలు రెండు రోజులపాటు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. 

భాగ్యనగరంలో..
భారీ వర్షాలతో భాగ్యనగరం అతలాకుతలం అవుతోంది. పలు బస్తీలు నీటమునిగాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. చార్మినార్‌ వద్ద 7.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో పురపాలకశాఖ డైరెక్టరేట్‌లోని ప్రజారోగ్య విభాగంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. జూలై  28 వరకు మూడు షిఫ్టుల్లో 24 గంటలూ అధికారులు అందుబాటులో ఉండనున్నారు.  హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. హిమాయత్ సాగర్ రిజర్వాయర్ నుంచి 2వేల 750 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేశారు. 

Also Read: Telangana, AP Rains News Live Updates: తెలంగాణ, ఏపీలో ఈ మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Rains effect: two-day holiday declared for all educational institutions in Telangana
News Source: 
Home Title: 

తెలంగాణలో వరుణుడి బీభత్సం.. భారీగా పంట నష్టం.. ఇవాళ, రేపు విద్యాసంస్థలకు సెలవులు..

Telangana Rains: తెలంగాణలో వరుణుడి బీభత్సం.. భారీగా పంట నష్టం.. ఇవాళ, రేపు  విద్యాసంస్థలకు సెలవులు..
Caption: 
Representational Image
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
తెలంగాణలో వరుణుడి బీభత్సం.. భారీగా పంట నష్టం.. ఇవాళ, రేపు విద్యాసంస్థలకు సెలవులు..
Samala Srinivas
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Wednesday, July 26, 2023 - 07:00
Request Count: 
74
Is Breaking News: 
No
Word Count: 
250