Prostitution Racket: సర్పంచ్ ఫామ్‌హౌజ్‌లో హైటెక్ వ్యభిచారం ?.. ప్రజాప్రతినిధి కూడా ఉన్నాడా ?

Prostitution in Sarpanch Farmhouse: ఈ సంఘటనలో ఓ ప్రజా ప్రతినిధి కూడా పట్టుబడినట్టుగా బయట ప్రచారం జరుగుతోంది. అతను పోలీసులకు చిక్కాడా లేక చాకచక్యంగా తప్పించుకున్నాడా ? అనే అంశం ప్రస్తుతం కొత్తూరు, మహేశ్వరం ప్రాంతాల రాజకీయ వర్గాల్లో ఓ హాట్ టాపిక్ అయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2023, 04:54 AM IST
Prostitution Racket: సర్పంచ్ ఫామ్‌హౌజ్‌లో హైటెక్ వ్యభిచారం ?.. ప్రజాప్రతినిధి కూడా ఉన్నాడా ?

Prostitution in Sarpanch Farmhouse: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో వెలిసిన ఓ వెంచర్‌లో నిర్మించిన ఫామ్ హౌజ్‌లో హైటెక్ వ్యబిచారం దందా గుట్టు రట్టయినట్టు తెలుస్తోంది. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించి వెస్ట్ బెంగాల్‌కి చెందిన ఓ యువతితో మరో ఐదుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన ఐదుగురు విటులను రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఐదుగురు విటులు యువతిని ఫామ్ హౌజ్‌కు తీసుకొచ్చి రాసలీలల్లో మునిగి తేలుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ సమాచారంతోనే పోలీసులు దాడులు నిర్వహించారు.
 
అయితే, యువతినీ ఏమైనా ప్రలోభ పెట్టి ఇక్కడకు తీసుకొచ్చారా ? లేక వ్యభిచారం నేపథ్యంతో ఉన్న యువతిని తీసుకువచ్చారా అనే విషయంలోనే స్పష్టత కొరవడింది. ఫామ్‌హౌజ్‌లో అరెస్ట్ అయిన వారి నుంచి మూడు కార్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం యువతితో పాటు ఐదుగురు విటులు పట్టుబడిన ఫామ్ హౌజ్ మహేశ్వరం ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన సర్పంచ్‌కి చెందినదిగా తెలుస్తోంది. 

ఇదే విషయమై కొత్తూరు సిఐ బాలరాజ్‌ను జీ తెలుగు న్యూస్ వివరణ కోరగా.. సీఐ బాలరాజు మాట్లాడుతూ, ఐదుగురు విటులు పోలీసుల అదుపులో ఉన్నట్లు ధృవీకరించారు. నిబంధన మేరకు విటులతో పాటు పట్టుబడిన యువతి వివరాలను గోప్యంగా ఉంచారు. 

ఆ ప్రజాప్రతినిధి కూడా ఉన్నాడా ? ఉంటే ఏమైనట్టు ? 
ఈ సంఘటనలో ఓ ప్రజా ప్రతినిధి కూడా పట్టుబడినట్టుగా బయట ప్రచారం జరుగుతోంది. అతను పోలీసులకు చిక్కాడా లేక చాకచక్యంగా తప్పించుకున్నాడా ? అనే అంశం ప్రస్తుతం కొత్తూరు, మహేశ్వరం ప్రాంతాల రాజకీయ వర్గాల్లో ఓ హాట్ టాపిక్ అయింది. ఫామ్ హౌజ్‌లో మొత్తం ఆరుగురు వ్యక్తులు మహిళతో కలిసి పట్టుబడినప్పటికీ.. ఇందులో ఒక ప్రజాప్రతినిధి ఉన్నందున అతడి వివరాలు వెల్లడించకుండా కేవలం ఐదుగురి వివరాలనే బహిర్గతం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిప్పు లేనిదే పొగ రాదన్న చందంగా.. వాస్తవానికి సదరు ప్రజాప్రతినిధిని టార్గెట్ చేసే ఉద్దేశంతోనే వేగులు పోలీసులకు ఈ సమాచారం అందజేశారని.. కానీ ఆ ప్రజాప్రతినిధి వివరాలే బహిర్గతం కావడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి : Rohini Sinduri vs Roopa Moudgil: ఐఏఎస్ vs ఐపిఎస్ వివాదం ఏ టు జడ్ మొత్తం ఎపిసోడ్.. కళ్లకు కట్టినట్టుగా..

ఇది కూడా చదవండి : Glamorous Women Politicians: తమను తాము ప్రూవ్ చేసుకున్న గ్లామరస్ లేడీ పొలిటిషియన్స్

ఇది కూడా చదవండి : Realme Smartphone: రూ. 17 వేల ఫోన్ కేవలం రూ. 1149 కే.. సూపర్ డీల్ కదా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

యాపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News