Ram Nath Kovind: హైదరాబాద్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్...స్వాగతం పలికిన గవర్నర్​, సీఎం..

Ram Nath Kovind:  భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు ఎయిర్‌పోర్ట్‌లో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 13, 2022, 03:30 PM IST
Ram Nath Kovind:  హైదరాబాద్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్...స్వాగతం పలికిన గవర్నర్​, సీఎం..

Ram Nath Kovind-Statue of Equality:  రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కాసేపట్లో 216 అడుగుల ఎత్తైన సమతామూర్తి (Statue of Equality) విగ్రహాన్ని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ (CM KCR) ఘనస్వాగతం పలికారు. కాసేపట్లో రాష్ట్రపతి (Ram Nath Kovind) రంగారెడ్డి జిల్లాలోని  ముచ్చింతల్​కు వెళ్లనున్నారు.

 రాష్ట్రపతి  మధ్యాహ్నం 3.30 గంటలకు ముచ్చింతల్ (Muchinthal) చేరుకుంటారు. అక్కడ సమతామూర్తి కేంద్రం, ఆలయాలు, బృహన్‌మూర్తి విగ్రహాన్ని సందర్శించనున్నారు.  అనంతరం సాయంత్రం 4 గంటలకు రామానుజుల స్వర్ణమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రామానుజుల స్వర్ణమూర్తిని 120కిలోల పసిడితో తయారు చేశారు. సమతామూర్తి కేంద్రంలోని భద్రవేది మొదటి అంతస్తులో 54 అడుగుల ఎత్తున దీన్ని అమర్చారు.

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో... సమతామూర్తి కేంద్రం వద్ద సుమారు 7 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం స్వర్ణమూర్తి విగ్రహానికి వేదపండితులు ప్రాణప్రతిష్టాపన చేయనున్నారు. రాష్ట్రపతి సాయంత్రం 5 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని...అక్కడి నుంచి రోడ్డుమార్గంలో రాజ్‌భవన్‌కు వెళ్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. 

Also Read: Bandi Sanjay: కేసీఆర్‌లో ఆ భయం మొదలైంది.. అందుకే ఈ డ్రామాలు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News