Pamela Satpathy: మహిళా అధికారిణి అని కూడా చూడకుండా తెలంగాణ మంత్రి రెచ్చిపోయారు. ఓ విషయంలో తప్పుబడుతూ మహిళా కలెక్టర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 'వాట్ ఈజ్ దిస్ నాన్సెన్స్' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమంలో అందరూ చూస్తుండగానే కలెక్టర్‌పై మంత్రి విరుచుకుపడడం వివాదాస్పదంగా మారింది. మహిళా అధికారిణిపై పొంగులేటి దూషిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. మంత్రి తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహిళా కలెక్టర్ అని చూడకుండా.. జిల్లా అధికారిణి అని మర్యాద ఇవ్వకుండా విరుచుకుపడడంపై ప్రజలు మండిపడుతున్నారు. మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: PRC And DAs: వేతన సవరణ సంఘం, డీఏల కోసం ప్రభుత్వ ఉద్యోగుల పోరాటం
కరీంనగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శుక్రవారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తోపాటు బండి సంజయ్ కుమార్, బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ చోట కలెక్టర్‌పై మంత్రి పొంగులేటితన అసహనాన్ని ప్రదర్శించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిపై మండిపడ్డారు.
Also Read: Retirement Age Increase: ప్రభుత్వ ఉద్యోగులకు 'కొత్త టెన్షన్'.. రిటైర్మెంట్ వయస్సు 65 ఏళ్లకు పెంపు?
కరీంనగర్‌లోని కుమార్ వాడి స్కూల్‌లో మంత్రి తన పక్కనే ఉన్న కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'వాట్ ఈజ్ దిస్ నాన్సెన్స్' అంటూ కలెక్టర్ వైపు కోపంగా చూస్తూ మండిపడ్డారు. అక్కడ ఎదురైన పరిస్థితులను గమనించిన మంత్రి తన కోపాన్ని ప్రదర్శించినట్టుగా అర్థం అవుతోంది. ఆ సమయంలో పక్కనే మరో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఉన్నారు. కలెక్టర్‌ను దూషిస్తున్న వీడియో వైరల్‌గా మారింది.
అయితే పోలీసులు పదే పదే తోసి వేస్తుండడంతో అసహనానికి గురై పొంగులేటి కలెక్టర్‌పై కోపం ప్రదర్శించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎస్పీ ఎక్కడ అంటూ పోలీసు అధికారుల తీరుపై కూడా పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరుతోనే ఆయన తన అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. పొంగులేటి తీరుపై కలెక్టర్ కలత చెందినట్లు సమాచారం. ఈ పరిణామంతో ఐఏఎస్ అధికారులు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రజాప్రతినిధులు అధికారులను దూషించిన సంఘటనలు ఉన్నాయి. తాజా వ్యవహారంతో ఐఏఎస్ అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది.
కరీంనగర్ కలెక్టర్ పై మంత్రి పొంగులేటి తీవ్ర వ్యాఖ్యలు. మహిళ కలెక్టర్ ను చీవాట్లు పెట్టడంపై ఆగ్రహం
Is This Acceptable @IASassociation @mpponguleti extreme impatience with Women collector @Collector_KNR IAS Pamela Satpathy#IASPamelaSatpathy #Karimnagar #Telangana #SRK #KTR pic.twitter.com/a2qYO2ZVCY
— SARAKU (Sateesh Ravi kumar) (@sargam_ravi) January 24, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.