Pawan Kalyan: బీజేపీతో పొత్తు లేనట్టేనా! జనసేన గెలిచే సీట్లు ఇవేనా?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దూకుడుగా వెళుతున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. తెలంగాణపైనా ఫోకస్ చేశారు. తెలంగాణలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో గత కొన్ని ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించినా తర్వాత వెనక్కి తగ్గారు. మిత్రపక్షం బీజేపీ కోసం పోటికి దూరంగా ఉన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 21, 2022, 07:32 AM IST
  • తెలంగాణలో పోటీ చేస్తామన్న పవన్ కల్యాణ్
  • 15 సీట్లు గెలుస్తామంటున్న జనసేనాని
  • జనసేన పోటీతో టీఆర్ఎస్ కు గండమే
Pawan Kalyan: బీజేపీతో పొత్తు లేనట్టేనా! జనసేన గెలిచే సీట్లు ఇవేనా?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దూకుడుగా వెళుతున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. తెలంగాణపైనా ఫోకస్ చేశారు. తెలంగాణలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో గత కొన్ని ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించినా తర్వాత వెనక్కి తగ్గారు. మిత్రపక్షం బీజేపీ కోసం పోటికి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం జనసేన పార్టీ బీజేపీతో పొత్తులో ఉంది. ఏపీలో రెండు పార్టీల నేతలు పలు సమావేశాలు కూడా జరిపారు. కాని తెలంగాణలో మాత్రం బీజేపీతో గ్యాప్ మెయింటేన్ చేస్తున్నారు జనసేనాని. కొన్నిసార్లు ఓపెన్ గానే తెలంగాణ బీజేపీ నేతలపై తన అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు తెలంగాణలో బీజేపీతో పొత్తుకు ఆసక్తి చూపడం లేదు పవన్ కల్యాణ్. అటు తెలంగాణ కమలం నేతలు కూడా జనసేనతో పొత్తు వద్దనే భావనలోనే ఉన్నారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర చేశారు. కాని ఆ యాత్రకు జనసేనకు పిలుపు లేదు. అంతేకాదు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు తెలంగాణ పర్యటనలకు వచ్చినా పవన్ కల్యాణ్ కు ఆహ్వానం లేదు. నిజానికి మిత్రపక్ష పార్టీల సభలకు నేతలు హాజరవుతుంటారు. కాని తెలంగాణ బీజేపీ కార్యక్రమాలకు పవన్ ను ఆహ్వానించడం లేదు. దీంతో జనసేనతో పొత్తు విషయంలో బండి సంజయ్ టీమ్ క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది.జనసేనతో పొత్తు ఏపీ వరకే పరిమితమని కొందరు తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు. తాజాగా తెలంగాణలో పర్యటించారు పవన్ కల్యాణ్. చనిపోయిన జన సైనికుల కుటుంబాలను పరామర్శించిన పవన్ కల్యాణ్.. తెలంగాణలో పోటీ చేసి తీరుతామని తెలిపారు. మూడో వంతు సీట్లలో తమ అభ్యర్థులు ఉంటారని ప్రకటించారు. పవన్ కామెంట్లతో తెలంగాణలో జనసేన ఒంటరిగానే పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది.

తెలంగాణలో పోటీ చేయడమే కాదు తమకు ఎక్కడ బలం ఉందో కూడా చెప్పారు పవన్ కల్యాణ్. ప్రతి నియోజకవర్గంలో తమకు కార్యకర్తలు ఉన్నారన్నారు. 30 నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇస్తామని చెప్పారు పవన్ కల్యాణ్. 15 అసెంబ్లీ సీట్లలో జనసేన గెలుస్తుందని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లోనూ 6 వేల వరకు తమ ఓటు బ్యాంక్ ఉందన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఆశ లేదన్న జనసేనాని.. ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్ గా ఉంటామని తేల్చి చెప్పారు. పవన్ చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారాయి. జనసేనకు తెలంగాణలో అంత బలం ఉందా.. పవన్ ఏ ధీమాతో చెబుతున్నారనే చర్చ నడుస్తోంది. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తమకు పట్టు ఉందని పవన్ లెక్కగా చెబుతున్నారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇస్తామంటున్నారు.

మేడ్చల్ జిల్లాలోని కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ ,శేరి లింగం పల్లి, మేడ్చల్ నియోజకవర్గాలతో పాటు రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాలను గెలుస్తామని పవన్ లెక్కలు వేసుకుంటున్నారు. ఈ నియోజకవర్గాల్లో సీమాంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉండటం తమకు లాభిస్తుందని జనసేనాని లెక్క. హైదరాబాద్ శివారు నియోజకవర్గాలైనా ఇబ్రహీంపట్నం, పటాన్ చెర్వుతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ, సూర్యాపేట జిల్లాలో తమకు బలం ఉందంటున్నారు జనసేన నేతలు. ఖమ్మం జిల్లాలో తాము ఖచ్చితంగా ఖాతా తెరుస్తామంటున్నారు. పాలమూరు జిల్లాలోనూ పవన్ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు తెలంగాణ జనసేన నేతలు.

మరోవైపు జనసేన పోటీతో ఏ పార్టీకి నష్టమనే చర్చ కూడా సాగుతోంది. జనసేన ఎక్కువగా సీమాంధ్ర ఓటర్లను నమ్ముకుంది. దీంతో జనసేన బరిలో ఉంటే.. ఏపీ ఓటర్లు కీలకంగా ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత మెజార్టీ సీమాంధ్ర ఓటర్లు టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నారనే ఎన్నికల ఫలితాలు తేల్చాయి. ఈ లెక్కన జనసేన పోటీలో ఉంటే.. మిగితా పార్టీల కంటే అధికార టీఆర్ఎస్ పార్టీకే నష్టం ఎక్కువగా జరగవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

READ ALSO: ఇష్టాగోష్టిలో కరెంట్ కట్.. మొబైల్ లైట్ల వెలుగులో ప్రోగ్రాం, ఫోటోలు వైరల్

READ ALSO: Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య కలకలం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

 

Trending News