Arms Smuggling Case: పాకిస్థాన్ నుంచి ఆదిలాబాద్‌కి ఆయుధాల తరలింపు కేసులో లేటెస్ట్ అప్‌డేట్

Terrorists' Arms Smuggling Case: పాకిస్థాన్ నుంచి హర్యానా మీదుగా ఆదిలాబాద్‌కు ఆయుధాలు, పేలుడు పదార్థాలు సరఫరా చేసిన కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను ఆదిలాబాద్‌ తరలించి ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 19, 2022, 06:12 PM IST
  • దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు
  • గతంలోనూ నాందేడ్‌కు ఆయుధాలు చేరవేత
  • విచారణలో కీలక అంశాలు రాబట్టిన పోలీసులు
Arms Smuggling Case: పాకిస్థాన్ నుంచి ఆదిలాబాద్‌కి ఆయుధాల తరలింపు కేసులో లేటెస్ట్ అప్‌డేట్

Terrorists' Arms Smuggling Case: పాకిస్థాన్ నుంచి హర్యానా మీదుగా ఆదిలాబాద్‌కు ఆయుధాలు, పేలుడు పదార్థాలు సరఫరా చేసిన కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను ఆదిలాబాద్‌ తరలించి ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. పాకిస్తాన్‌ బోర్డర్‌ నుంచి ఆయుధాల చేరవేత కేసుకు సంబంధించి గతంలోనే ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వాళ్ల నుంచి ప్రాథమికంగా పలు వివరాలు సేకరించారు. ఇప్పుడు వీళ్లను ఆదిలాబాద్‌కు తరలించి వివరాలు రాబట్టే అవకాశం కనిపిస్తోంది. పాకిస్తాన్‌ నుంచి తెచ్చిన ఆయుధాలను వీళ్లు ఎవరికి చేరవేశారన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. 

ఇప్పటికే అరెస్ట్‌ అయిన నలుగురు నిందితుల దగ్గర 22 లక్షల రూపాయల హవాలా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు.. వీళ్లకు పాక్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు కూడా తేల్చారు. దాయాది దేశం పాకిస్థాన్ నుంచి డ్రోన్‌ల ద్వారా భారత సరిహద్దులోకి ఉగ్రవాదులు ఆయుధాలను చేరవేస్తున్నారు. ఆ ఆయుధాలను పాక్‌ సరిహద్దు నుంచి ఈ ఖలిస్తాన్‌ ఉగ్రవాద ముఠా హర్యానాకు చేరవేసింది. 

హర్యానా నుంచి ఆదిలాబాద్‌కు వీటిని తరలించి.. అక్కడి నుంచి నాందేడ్‌కు ఆ ఆయుధాలు, పేలుడు పదార్థాలను పంపించేందుకు ఈ ముఠా కుట్ర పన్నిందని దర్యాప్తులో తేలింది. గతంలోనూ ఈ ముఠా.. పాకిస్తాన్‌ నుంచి నాందేడ్‌కు (Arms smuggling from Pakistan to Adilabad) ఆయుధాలను పంపించిందని పోలీసుల విచారణలో తేలింది. దీంతో, పోలీసులు మరింత సీరియస్‌గా ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Also read : Supreme court:దిశా ఎన్‌కౌంటర్‌పై రేపు సుప్రీం కోర్టు కీలక ప్రకటన..!

Also read : Kinnera Mogulaiah: నా నోట్లో మన్ను పోస్తారా.. పద్మశ్రీ తిరిగి ఇచ్చేస్తా! కిన్నెర మొగులయ్య సంచలనం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News