Telangana: నాన్ అగ్రికల్చరల్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభం

Non Agricultural Property Registration in Telangana : తెలంగాణలో వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు సోమవారం (డిసెంబర్ 14) నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు మూడు నెలల అనంతరం ఈ ప్రక్రియ తిరిగి కొనసాగనుంది. పాత విధానంలోనే నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ఇటీవల ఆదేశించింది.

Last Updated : Dec 14, 2020, 08:56 AM IST
  • నేటి నుంచి నాన్ అగ్రికల్చరల్ రిజిస్ట్రేషన్లు
  • 141 సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులలో ఏర్పాట్లు
  • స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి ఛాన్స్
Telangana: నాన్ అగ్రికల్చరల్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభం

Non Agricultural Property Registration in Telangana : తెలంగాణలో వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు సోమవారం (డిసెంబర్ 14) నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు మూడు నెలల అనంతరం ఈ ప్రక్రియ తిరిగి కొనసాగనుంది. పాత విధానంలోనే నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ఇటీవల ఆదేశించింది. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే రికార్డుల్లో పేరు మార్పు పూర్తిచేయడంతో పాటు సంబంధిత వ్యక్తులకు ఈ పాస్ బుక్ అందించనున్నామని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది.

Also Read: Properties Registration: తొలిరోజే రూ.85 లక్షల ఆదాయం.. 

అయితే రిజిస్ట్రేషన్ల వెబ్‌సైట్‌లో పొందుపర్చిన నాన్‌-అగ్రికల్చర్‌ ఆప్షన్‌ ఓపెన్‌ కావడం లేదని సమాచారం. నేడు (డిసెంబర్ 14న) స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి ఒక్కో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు మాత్రం జరగనున్నాయి. ఇందులో ఇళ్లు, స్థలాలు, ఫ్లాట్‌ల భూములు, ఆస్తులు ఉండనున్నాయి. ఆదివారం సాయంత్రం తెలంగాణ (Telangana) సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. నేటి ఉదయం నుంచి నాన్ అగ్రికల్చర్ ఆస్తులకు రిజిస్ట్రేషన్లకు సంబంధించిన లింక్ సబ్ రిజిస్ట్రార్‌లకు అందజేయనున్నారు.
Also Read: Solar Eclipse 2020: సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు అసలు చేయకండి

కాగా, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ స్లాట్ బుకింగ్‌ ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే తెలంగాణ ప్రభుత్వానికి రూ.85 లక్షల ఆదాయం సమకూరింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రక్రియను ప్రారంభించిన 15 నిమిషాల్లోనే రెండుస్లాట్లు బుక్‌ అయ్యాయి. రాత్రి 7 గంటల వరకు 37 స్లాట్లు బుక్‌ అయ్యాయి. అయితే సోమవారం నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభంకానున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు, ఉద్యోగులకు రెండో శనివారం, ఆదివారం సెలవులను రద్దు చేయడం తెలిసిందే.
Also Read: Solar Eclipse 2020: ఈ రాశులవారిపై సూర్యగ్రహణం ప్రభావం! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News