హైదరాబాద్ : కరోనావైరస్కి (Coronavirus) వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న పోరాటంలో రానున్న రెండు వారాలు చాలా కీలకమైనవి అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ (Union health minister Harshavardhan) అన్నారు. గురువారం వివిధ రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కేంద్ర మంత్రి హర్షవర్థన్.. వివిధ రాష్ట్రాల్లో కరోనావైరస్ (COVID-19) నివారణకు తీసుకుంటున్న చర్యలు, ప్రస్తుత పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో వైరస్ నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ పలు సూచనలు చేశారు.
Read also : గాళ్ ఫ్రెండ్‌తో హార్ధిక్ పాండ్య రొమాన్స్.. వైరల్‌గా మారిన క్వారంటైన్ పిక్
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనావైరస్ నివారణలో రాబోయే రెండు వారాలు చాలా కీలకమైనవని గుర్తుచేస్తూ.. విదేశాల నుండి వచ్చిన వారిని అబ్జర్వేషన్లో ఉంచాలని, హోమ్ క్వారంటెన్ నుండి బయటికి రాకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాల్సిందిగా కోరారు. అదే సమయంలో కరోనా వైరస్ బాధితుల గుర్తింపులో, సేవల్లో ప్రభుత్వాలకు తోడ్పాటును అందిస్తున్న ఆశా వర్కర్లకి ఇన్సూరెన్స్ చేసినట్లు కేంద్ర మంత్రి స్పష్టంచేశారు.
Read also : Lockdown: అనుమతి లేకుండా సంవత్సరీకం.. కేసు నమోదు
కరోనావైరస్ పాజిటివ్ కేసులకు వైద్య సహాయం అందిస్తున్న సిబ్బందికి ఆ వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. కేంద్రం విధించిన లాక్డౌన్ పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని.. అప్పుడే వైరస్ వ్యాపించకుండా పరిస్థితి అదుపులో ఉంటుందని కేంద్ర మంత్రి రాష్ట్రాలకు విజ్ఞప్తిచేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..