Munugode bypoll updates: మునుగోడులో టిఆర్ఎస్ పార్టీకి షాక్ మీద షాక్

Munugodu trs leaders joins BJP: మునుగోడు ఉప ఎన్నిక కంటే ముందే ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గత కొంత కాలంగా టీఆర్ఎస్ పార్టీపై గుర్రుగా ఉన్న ఇంకొంతమంది  నేతలు ఇవాళ ఆ పార్టీకి షాకిస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపిలో చేరారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 21, 2022, 11:55 PM IST
Munugode bypoll updates: మునుగోడులో టిఆర్ఎస్ పార్టీకి షాక్ మీద షాక్

Munugodu trs leaders joins BJP: మునుగోడు ఉప ఎన్నిక కంటే ముందే ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎలాగైనా సరే దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం మునుగోడులో రిపీట్ కాకుండా ఉండాలని టీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తుండగా.. నియోజకవర్గంలో వివిధ మండలాలు, గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరిగా టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారు. నిన్న చండూరు జెడ్పిటిసి, గట్టుప్పల్ ఎంపిటిసిలు టీఆర్ఎస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. 

ఈ షాక్ నుంచి ఇంకా తేరుకోక ముందే ఇవాళ ఇంకొంత మంది నేతలు తమ కేడర్‌తో కలిసి టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. చౌటుప్పల్ మండలం అల్లాపురం సర్పంచ్ కొలను శ్రీనివాస్ రెడ్డి, గుండ్లబావి సర్పంచ్ పెద్దింటి హేమలత చంద్రా రెడ్డి, అంకిరెడ్డిగూడెం సర్పంచ్ ముద్దం సుమిత్ర సత్తయ్య గౌడ్‌లు కారులోంచి దిగి కమలానికి జై కొట్టారు. 

గత కొంత కాలంగా టీఆర్ఎస్ పార్టీపై గుర్రుగా ఉన్న ఈ నేతలు ఇవాళ ఆ పార్టీకి షాకిస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపిలో చేరారు. రానున్న కొద్ది రోజుల్లో టీఆర్ఎస్ దుకాణం ఖాళీ అయి బీజేపీలో చేరడం పక్కా అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. టీఆర్ఎస్ పార్టీ నేతలు చాలా మంది తమతో టచ్ లో ఉన్నారని.. టీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరికలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయని రాజగోపాల్ రెడ్డి ముందు నుంచీ చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే.

Also Read : Munugode Bypoll: కేసీఆర్ సమీక్ష చేసిన రోజే షాక్.. మునుగోడు సీనియర్ నేత జంప్.. మంత్రి జగదీశ్ రెడ్డి కారణమా?

Also Read : KTR ON JAGAN: ఏపీలో జగన్ పాలన సూపరట. కితాబిచ్చిన కేటీఆర్! కేసీఆర్ కు మద్దతు కోసమేనా..?

Also Read : Jeevitha Rajasheker: జీవితా రాజశేఖర్ కు బీజేపీ టికెట్ హామీ! పోటీ ఎక్కడినుంచో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News