రాత్రి 10 గంటల ప్రాంతంలోనూ ఎమ్మెల్యే సీతక్క ప్రజా సేవ

కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చూసేందుకు తాను చేయాల్సిందంతా చేస్తున్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. గత కొన్ని రోజులుగా వాగులు, వంకలు దాటుకుంటూ రోడ్డు మార్గం కూడా సరిగ్గా లేని గ్రామాల్లోకి వెళ్తున్న ఆమె.. అక్కడి ప్రజలకు నిత్యవసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేస్తున్నారు.

Last Updated : Apr 25, 2020, 12:15 AM IST
రాత్రి 10 గంటల ప్రాంతంలోనూ ఎమ్మెల్యే సీతక్క ప్రజా సేవ

ములుగు: కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చూసేందుకు తాను చేయాల్సిందంతా చేస్తున్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. గత కొన్ని రోజులుగా వాగులు, వంకలు దాటుకుంటూ రోడ్డు మార్గం కూడా సరిగ్గా లేని గ్రామాల్లోకి వెళ్తున్న ఆమె.. అక్కడి ప్రజలకు నిత్యవసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగానే శుక్రవారం కూడా రాత్రి 10 గంటలు దాటినా ఆమె సీతక్క సహాయక చర్యల్లోనే సమయం తెలియకుండా గడుపుతుండటం విశేషం. 

మంగపేట మండలంలోని కొత్తపేట ఎస్సీ కాలనీ, కమలాపురం గ్రామంలోని వడ్డెర కాలనీలో ఉంటున్న నిరుపేద కుటుంబాలకు ఎమ్మెల్యే సీతక్క 5kgల బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు.

Trending News