Mlc Kavitha: కేసీఆర్ ను బద్నాం చేసేందుకు బీజేపీ కుట్ర.. లిక్కర్ స్కాంతో తనకు సంబంధం లేదన్న కవిత

Mlc Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన పాత్ర ఉందంటూ వస్తున్న ఆరోపణలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకి తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. తనపై పూర్తిగా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు

Written by - Srisailam | Last Updated : Aug 22, 2022, 02:47 PM IST
  • ఢిల్లీ లిక్కర్ స్కాంపై స్పందించిన కవిత
  • లిక్కర్ స్కాంతో నాకు సంబంధం లేదు- కవిత
  • ఎలాంటి విచారణకైనా సిద్దం- కవిత
Mlc Kavitha: కేసీఆర్ ను బద్నాం చేసేందుకు బీజేపీ కుట్ర.. లిక్కర్ స్కాంతో తనకు సంబంధం లేదన్న కవిత

Mlc Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన పాత్ర ఉందంటూ వస్తున్న ఆరోపణలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకి తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. తనపై పూర్తిగా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్‌ కూతురును కాబట్టే తనను టార్గెట్ చేశారని ఆరోపించారు.కేసీఆర్ బిడ్డను బద్నాం చేస్తే భయపడిపోతారేమోననే చిల్లర ప్రయత్నం.. వర్ధ ప్రయత్నమే తప్ప ఇలాంటి వాటికి కేసీఆర్ భయపడరు అని కవిత కామెంట్ చేశారు.

దేశవ్యాప్తంగా కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు.. బట్టకాల్చి మీద వేస్తున్నారని కవిత విమర్శించారు. ఎవరి మీద పడితే వారిమీద ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. కేసీఆర్ ని మానసికంగా కృంగదీయాలని చూస్తున్నారని తెలిపారు. ఉద్యమ సమయంలో తమపై ఎన్నో ఆరోపణలు చేసినా మడమ తిప్పకుండా పోరాటం చేశామన్నారు కవిత. లిక్కర్ స్కాంలో ఏ విచారణకైనా తాను సిద్దమని కవిత స్పష్టం చేశారు. ఎలాంటి దర్యాప్తు అయినా చేసుకోవచ్చని తేల్చి చెప్పారు. విపక్షాలపై బట్ట కాల్చి మీద వేయడమే బీజేపీ పని అన్నారు కవిత.

ప్రజాస్వామ్యంలో ఇది ఆరోగ్యకర వాతావరణం కాదన్నారు ఎమ్మెల్సీ కవిత. ప్రతిపక్ష పార్టీలపై ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ ఎండగడుతున్నారు.. కాబట్టే తమపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కవిత అన్నారు. తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసు అన్నారు. ఏం జరిగినా కేసీఆర్‌ వెనక్కి తగ్గరని స్పష్టం చేశారు కవిత. బీజేపీ ఎన్ని కుట్రలు చేసిన పోరాటం ఆపబోరన్నారు.  దేశ అభివృద్ధి కోసం కేసీఆర్‌ ప్రతిక్షణం ఆలోచిస్తున్నారని కవిత తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న కేసీఆర్ ను మానసికంగా దెబ్బ తీసేందుకు.. ఆయన కుటుంబ ప్రతిష్టను దెబ్బతీయాలని బీజేపీ చూస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కవిత. కేంద్ర జాతీయ సంస్థలు, మీడియాను అడ్డం పెట్టుకుని తమను బద్నాం చేయాలని చూస్తున్నారని అన్నారు.

మరోవైపు ఢిల్లీ మద్యం విధానంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకుగాను ఢిల్లీ బిజెపి నేతలపై పరువు నష్ట దావా వేయనున్నారు ఎమ్మెల్సీ  కవిత. బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సా పై పరువు నష్ట దావా వేయబోతున్నారు.నిరాధార ఆరోపణలు చేసినందుకు వ్యతిరేకంగా ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలని  కోర్టును అశ్రయించనున్నారు. దీనిపై ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చించారు కవిత.

Also read: Bandi Sanjay: బండి సంజయ్ వీడియో వైరల్.. మంత్రి కేటీఆర్ సెటైర్... ఆ వీడియోలో ఏముందో తెలుసా..?

Also read:  Munugode Bypoll: 5 వందలు.. మందు.. మటన్ బిర్యానీ! జనాలకు ఉపాధినిస్తున్న మునుగోడు ఉపఎన్నిక 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News