Minister KTR: హుజూరాబాద్ ఓటమిపై మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే..

Minister KTR about Huzurabad by-poll results: గత 20 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూసిందన్న మంత్రి కేటీఆర్.. ఈ ఒక్క ఉప ఎన్నిక ఫలితంతో పార్టీకి (TRS Party) ఒరిగే నష్టం కానీ లేదా పార్టీపై పడే ప్రభావం కానీ ఏమీ ఉండబోదని స్పష్టంచేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 3, 2021, 03:29 AM IST
Minister KTR: హుజూరాబాద్ ఓటమిపై మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే..

Minister KTR about Huzurabad by-poll results: హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమిపాలై, బీజేపి అభ్యర్థి మాజీ మంత్రి ఈటల రాజేందర్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు హుజూరాబాద్ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఓటమిపై స్పందించారు. గత 20 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూసిందన్న మంత్రి కేటీఆర్.. ఈ ఒక్క ఉప ఎన్నిక ఫలితంతో పార్టీకి ఒరిగే నష్టం కానీ లేదా పార్టీపై పడే ప్రభావం కానీ ఏమీ ఉండబోదని స్పష్టంచేశారు. 

హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో విజయం కోసం పోరాడిన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు (Gellu Srinivas Yadav) అభినందనలు చెప్పిన మంత్రి కేటీఆర్.. పార్టీని గెలిపించేందుకు కృషి చేసిన మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌లకు, పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. 

హుజూరాబాద్ ఉప ఎన్నికలో పార్టీ విజయం కోసం శ్రమించిన సోషల్ మీడియా వారియర్స్‌కి కూడా కృతజ్ఞతలు చెబుతున్నట్టు మంత్రి కేటీఆర్ (Minister KTR about Huzurabad by-poll results) ట్విటర్ ద్వారా తెలిపారు.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x