Retirement Benefits: ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల కీలక అడుగు.. రిటైర్డ్‌ బెనిఫిట్స్‌ కోసం న్యాయపోరాటం

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి రోజురోజుకు గడ్డుగా మారుతోంది. ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తామని గొప్పగా ప్రకటించిన రేవంత్‌ రెడ్డి మాట తప్పాడు. ఇప్పుడు ఏ శాఖలో కూడా ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు చెల్లించడం లేదు. ఇక దీనికి తోడు పదవీ విరమణ పొందుతున్న మాజీ ఉద్యోగులకు ప్రయోజనాలు దక్కడం లేదు. సుదీర్ఘకాలంగా పదవీ విరమణ ప్రయోజనాలు బకాయి పడ్డారు. దీంతో ఆగ్రహానికి లోనయిన మాజీ ఉద్యోగులు ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు తమ పదవీ విరమణ ప్రయోజనాల కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 11, 2025, 03:42 PM IST
Retirement Benefits: ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల కీలక అడుగు.. రిటైర్డ్‌ బెనిఫిట్స్‌ కోసం న్యాయపోరాటం

Employees Retirement Benefits: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి రోజురోజుకు గడ్డుగా మారుతోంది. ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తామని గొప్పగా ప్రకటించిన రేవంత్‌ రెడ్డి మాట తప్పాడు. ఇప్పుడు ఏ శాఖలో కూడా ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు చెల్లించడం లేదు. ఇక దీనికి తోడు పదవీ విరమణ పొందుతున్న మాజీ ఉద్యోగులకు ప్రయోజనాలు దక్కడం లేదు. సుదీర్ఘకాలంగా పదవీ విరమణ ప్రయోజనాలు బకాయి పడ్డారు. దీంతో ఆగ్రహానికి లోనయిన మాజీ ఉద్యోగులు ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు తమ పదవీ విరమణ ప్రయోజనాల కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

Also Read: Sankranti Special: సంక్రాంతికి బాంబు పేల్చిన తెలంగాణ ఆర్టీసీ.. ప్రత్యేక బస్సుల్లో భారీగా ధరల పెంపు

గతేడాది 2024లో 7,995 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. వారికి ఇప్పటివరకు పదవీ విరమణ ప్రయోజనాలు దక్కలేదు. వారికి ఇవ్వాల్సిన రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ దాదాపు రూ.4 వేల కోట్ల వరకు ఉంటాయి. ప్రయోజనాల కోసం మాజీ ఉద్యోగులు సచివాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. అధికారులను వేడుకుంటున్నా వారికి సంబంధించిన ప్రయోజనాలు విడుదలయ్యాయి. 45 రోజుల్లోగా వడ్డీతో సహా మొత్తం ఆర్థిక ప్రయోజనాలు అందించాలని గతంలోనే హైకోర్టు తీర్పునిచ్చింది. కానీ ప్రస్తుత రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 

Also Read: KT Rama Rao: ఏసీబీ విచారణపై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు.. 82 ప్రశ్నలు అడిగి సంపిండ్రు

తమ బెనిఫిట్స్‌ రాకపోవడంతో ఇటీవల ఓ ఏఎస్సై ఆత్మహత్యకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా పదవీ విరమణ ఉద్యోగుల కష్టాలు బహిర్గతమయ్యాయి. 'అప్పులోళ్లకు ముఖం చూపించలేక వేరే ఊర్లో తలదాచుకుంటున్న. రిటర్మెంట్‌ బెనిఫిట్‌ చెల్లించకపోతే ఆత్మహత్య చేసుకుంటా' అని విశ్రాంత ఏఎస్సై కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ ఘటనతో పదవీ విరమణ ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారి బాధలను న్యాయస్థానానికి వివరించారు.

ఉద్యోగుల సమగ్ర వివరాలు
రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వం ఉద్యోగుల సంఖ్య 3.59 లక్షలు. వీరిలో ఉపాధ్యాయులు 1.1 లక్షల మంది ఉండగా.. ప్రతినెలా రిటైర్మెంట్లు 800 నుంచి వెయ్యి మంది అవుతుంటారు. రిటైర్మెంట్‌ పొందిన ఉద్యోగులకు రూ.35 లక్షల నుంచి రూ.75 లక్షలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. జీపీఎఫ్‌, జీఎల్‌ఐ, గ్రాట్యూటీ, సరెండర్‌ లీవుల రూపంలో ఆ ప్రయోజనాలు దక్కాల్సి ఉంది. వీటిని చెల్లించాల్సి ఉండగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం చెల్లించడం లేదు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News