పనులు అసంపూర్తిగా సాగడంపై నీటిపారుదలశాఖ అధికారులపై తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి శుక్రవారం పరిశీలించారు. తొగుట మండలం తుక్కాపూర్‌లోని కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ12 ద్వారా దుబ్బాకకు మల్లన్న సాగర్ ద్వారా సాగునీటిని అందించే 40 కిలోమీటర్ల మేర కాలువ పనులను తనిఖీ చేశారు.
దుబ్బాక ప్రధాన కాలువ ద్వారా నీళ్లు పారుతున్న దారిని ఎంపీ, ఎమ్మెల్యే, నీటిపారుదలశాఖ అధికారులతో కలిసి మంత్రి హరీష్ రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొగుట మండలంలోని తుక్కాపూర్, ఎల్లారెడ్డి పేట, మాసాన్ పల్లి, బండారుపల్లి మీదుగా వెళ్లే ప్రధాన కాలువలో పలుచోట్ల పనులు అసంపూర్తిగా ఉండటాన్ని మంత్రి హరీష్ రావు గమనించారు. పనులు సక్రమంగా చేయాలని, నిర్లక్ష్యం వహించొద్దంటూ నీటిపారుదల శాఖ అధికారులపై మండిపడ్డారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్
Bikiniలో అమెరికన్ అందం హాట్ పోజులు