హైదరాబాద్ శివార్లలోని గగన్‌పహడ్‌లో మంగళవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆయిల్ కంపెనీలో చెలరేగిన మంటలు పరిశ్రమ మొత్తం వ్యాపించాయి. భారీగా ఎగిసిపడిన మంటల కారణంగా ట్యాంకర్లు పేలడంతో అగ్ని ప్రమాదం తీవ్రత మరింత పెరిగినట్టు తెలుస్తోంది. ఆయిల్ ట్యాంకర్లు పేలడంతో ఆ ప్రాంతాన్ని దట్టమైన పొగ కమ్మేసింది.
ఆయిల్ కంపెనీలో ఓ చోట ఆయిల్ లీక్ కాగా అది గమనించుకోని వాళ్లు ఎవరో అక్కడే వున్న పాత బట్టలపై సిగరెట్ పడేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదృష్టవశాత్తుగా ఈ దుర్ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ భారీ మొత్తంలో ఆస్తి నష్టం సంభవించినట్టు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.
హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం..భారీగా ఆస్తి నష్టం