అభిమానుల అభిమానానికి అంతే ఉండదు. తాము ఆరాధించే ఫిల్మ్ స్టార్స్, తమ అభిమాన నేతలు .. ఇలా ఎవరికైనా తమ అభిమానాన్ని వారు విపరీతంగా చూపిస్తారు. తాజాగా అలాంటి అభిమాని ఒకరు తన అభిమానాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ కు చూపించారు.
జెల్లు శ్రీను అనే వ్యక్తి మంత్రి కేటీఆర్ కు వీరాభిమాని. ఆయన తన అభిమానాన్ని నిరూపించుకోవడానికి ఏకంగా కేటీఆర్ ఫోటోను వీపుపై టాటూ వేయించుకున్నాడు. యంగ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ అంటూ రాయించుకున్నాడు. జై రామన్న అంటూ ఓ నినాదాన్ని కూడా టాట్టూగా వేయించుకున్నాడు. ఈ టాట్టూను ఫోటో తీయించి .. ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్. . ఆ అభిమాని అభిమానాన్ని సున్నితంగా తిరస్కరించారు. ఇది నిజమేనా..!! సారీ బ్రదర్ నేను ఇలాంటి వాటిని సమర్ధించను.. అనుమతించనని ఖరాఖండీగా చెప్పేశారు. ఇది అనారోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుందని ట్వీట్ చేశారు.
Is that for real!!!! 😐 Sorry brother but I don’t support or endorse these. It’s absolutely unhealthy and disturbing 🙏 https://t.co/JlS7pqE7NO
— KTR (@KTRTRS) February 24, 2020
దయచేసి అభిమానులు ఎవరూ ఇలాంటి పనులు చేయవద్దని మంత్రి కేటీఆర్ సూచించడం విశేషం.