KT Rama Rao: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 100 సీట్లతో బీఆర్ఎస్ గెలుపు పక్కా

BRS Party Will Be Win 100 MLAs Says KT Rama Rao: రేవంత్‌ రెడ్డి చేతకానితనంతో తెలంగాణ అస్తవ్యస్తమైందని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు తమదేనని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జోష్యం చెప్పారు. మళ్లీ వచ్చేది కేసీఆర్‌ ప్రభుత్వమని ప్రకటించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 9, 2024, 10:34 PM IST
KT Rama Rao: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 100 సీట్లతో బీఆర్ఎస్ గెలుపు పక్కా

BRS Party: దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి కేసీఆర్ తన దీక్షతో తెలంగాణ ప్రకటనకు శ్రీకారం చుట్టారని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ ఉన్నంత వరకు రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్ నాయకత్వంలో జరిగిందని గుర్తిస్తారని స్పష్టం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వంద సీట్లతో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు పక్కా అని ప్రకటించారు. మరోసారి కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవడం ఖాయమని తెలిపారు.

Also Read: K Kavitha: తుపాకీ గురిపెట్టిన రేవంత్ రెడ్డి తీరుతో తెలంగాణ తల్లి కన్నీళ్లు

కేసీఆర్‌ దీక్షా దివస్‌ సందర్భంగా మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని సోమవారం సాయంత్రం కేటీఆర్‌ పార్టీ ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం గులాబీ జెండా ఎగురవేసి.. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజును అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి సన్మానించారు. అనంతరం జరిగిన సభలో కేటీఆర్‌ కీలక ప్రసంగం చేశారు.

Also Read: KTR: ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ తరపున అసెంబ్లీలో రేవంత్‌ రెడ్డిని ప్రశ్నిస్తాం.. నిలదీస్తాం

'కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని తెలంగాణపై దాడి చేస్తున్నారు. కేసీఆర్‌ను చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నంలో అస్తిత్వం మీద దాడి జరుగుతోంది' అని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 'ఆర్టీసీ లోగోలో కాకతీయ కళాతోరణం మాయమైంది. తెలంగాణ తల్లిలో బతుకమ్మ మాయమైంది. సచివాలయంలో లంకె బిందెలు లేవని రేవంత్ రెడ్డికి అర్ధమై తెలంగాణ తల్లి విగ్రహంలోని కిరీటాన్ని.. అందులోని కోహీనూర్‌ వజ్రాన్ని మాయం చేశారు' అని విమర్శించారు.

'తెలంగాణ ఇస్తే మీకు పరిపాలన రాదని సమైక్య పాలకులు అన్నారు. వచ్చిన తెలంగాణను పదేళ్లలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. తెలంగాణ భాషను.. యాసను వెక్కిరించారు. ఇందిరాగాంధీ భారతమాతను హరిద్వార్‌లో ఏర్పాటు చేశారు. సమైక్య పాలకులు పగబడితే 2007లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం' అని కేటీఆర్‌ చరిత్రను గుర్తు చేశారు. హంతకులే సంతాపం తెలిపినట్లు ఉందని రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్న వాళ్లు తెలంగాణ తల్లి బీదగా ఉండాలని రూపాన్ని మార్చారు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తల్లిని మార్చిన మూర్ఖులు
'ప్రపంచంలో ఆలిని మార్చిన వాళ్లు ఉన్నారు. కానీ తల్లిని మార్చిన మూర్ఖులు ఎవరూ లేరు' అని రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మారితే తెలంగాణ తల్లి విగ్రహం మారాలా? ప్రజల బతుకులు మారాలా? అని ప్రశ్నించారు. 'ఎప్పుడు ఎన్నికలు జరిగిన వంద సీట్లతో బిఆర్ఎస్ గెలుపు పక్కా. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే తెలంగాణ తల్లి స్థానంలో పెట్టిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్‌కు పంపుతాం' అని ప్రకటించారు. సెక్రటేరియట్‌లో పెట్టిన కాంగ్రెస్‌ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్‌కు పంపుతాం' అని కేటీఆర్‌ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News