Telangana Padayatra: పాదయాత్ర ప్రకటనలు చేసిన కేటీఆర్, రేవంత్ రెడ్డి పాదయాత్రలు కాదు మోకాళ్ల యాత్రలు చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఇద్దరు నాయకులపై ఆయన విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డివన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలేనని వ్యాఖ్యానించారు. దీపావళి దాటినా రాజకీయ బాంబులు పేల్చలేదేం? అని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు రెండూ ఒక్కటేనని.. దొందూ దొందేనని తెలిపారు.
Also Read: Letter Viral: ప్రభుత్వ టీచర్ సంచలన లేఖ.. సమగ్ర కుటుంబ సర్వేను వ్యతిరేకమంటూ కలకలం
కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇల్లంతకుంట, బెజ్జంకి మండలాల్లో శుక్రవారం బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా మూసీ ప్రాజెక్టుపై వాడపల్లి వరకు పాదయాత్ర చేస్తానని రేవంత్ రెడ్డి.. బీఆర్‌ఎస్ పార్టీ బలోపేతం కోసం తాను పాదయాత్ర చేస్తానని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాదయాత్ర చేస్తానని చేసిన ప్రకటనలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ చేయాల్సింది పాదయాత్ర కాదు మోకాళ్ల యాత్ర చేయాలని తెలిపారు.
Also Read: KTR: ప్రజా క్షేత్రంలోకి కేటీఆర్.. పాదయాత్ర చేస్తానని సంచలన ప్రకటన
6 గ్యారంటీలపై రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసే దమ్ముందా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. మోదీపై కాంగ్రెస్ యుద్దం దేనికోసం? అని సందేహం వ్యక్తం చేశారు. 6 గ్యారంటీల పేరుతో ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి మోసం చేశారని విమర్శించారు. తాను ఎన్నికలకు ముందే రాజకీయాలు.. తరువాత అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
'మూసీపై పాదయాత్ర చేస్తానంటున్న రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలను అమలు చేశామని చెప్పుకుంటూ పాదయాత్ర చేసే దమ్ముందా?' అని కేంద్ర మంత్రి బండి సంజయ్ నిలదీశారు. 'రైతు భరోసా ఇవ్వకుండా గోస పెడుతున్నారు. మహిళలకు తులం బంగారం, స్కూటీ, నెలనెలా రూ.2,500 ఇస్తానని రేవంత్ రెడ్డి మోసం చేశాడు. 6 గ్యారంటీల పేరుతో ఓట్లేయించుకుని నిలువునా మోసం చేశాడు' అని గుర్తుచేశారు. '2 లక్షల ఉద్యోగాలిస్తామని మోసం చేశారు. ఉద్యోగులకు 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నా ఇవ్వకుండా దగా చేశాడు. ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కాక చేతులెత్తేసి సిగ్గు లేకుండా పాదయాత్ర చేస్తానంటారా?' అని మండిపడ్డారు.
'దీపావళికి ముందే రాజకీయ బాంబులు పేలుతాయన్నారు. కాంగ్రెసోళ్ల రాజకీయ బాంబు మాత్రం పేలలే. తుస్సుమంది. 6 గ్యారంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ నేతలు డ్రామాలాడుతున్నారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించి రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచే యుద్దం ప్రారంభించిందని అనడం సిగ్గు చేటు' అని బండి సంజయ్ మండిపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి