KT Rama Rao: 'దేశంలో ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచింది ఒకే ఒక్క సీఎం కేసీఆర్‌'

KT Rama Rao Unveils TRTU Calendar At Hyderabad: కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ విశేషంగా కృషి చేశారని.. కార్మికులను పొట్టన పెట్టుకుని చూసుకున్నారని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకమైందని పేర్కొన్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 20, 2025, 03:45 PM IST
KT Rama Rao: 'దేశంలో ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచింది ఒకే ఒక్క సీఎం కేసీఆర్‌'

TRTU Calendar: అన్ని వర్గాల జీతాలు అత్యధికంగా పెంచింది నాటి సీఎం కేసీఆర్‌ ఒక్కరేనని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కరోనా సమయంలో కార్మికులను పొట్టలో పెట్టుకుని చూసుకున్నారని గుర్తుచేశారు. జీహెచ్‌ఎంసీ కార్మికులతోపాటు అంగన్‌వాడీ, ఆశ వర్కర్లకు జీతాలు పెంచారని చెప్పారు. కార్మికులను కేసీఆర్‌ అభివృద్ధిలో భాగస్వాములు చేశారని పేర్కొన్నారు.

Also Read: Retirement Age: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్‌.. పదవీ విరమణ వయస్సు తగ్గించాలని జేఏసీ ఆందోళన

హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో సోమవారం కార్మిక విభాగం (టీఆర్‌టీయూ) క్యాలెండర్‌ను కేటీఆర్‌ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. 'అసెంబ్లీ ఎన్నికల్లో 4 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయినా బీఆర్ఎస్ పార్టీకి పోరాట పటిమ తగ్గలేదని కార్మిక విభాగం నిరూపించింది. ముఖ్యమంత్రి అయిన 15 రోజులకే కేసీఆర్ హమాలీలను పిలిచి మాట్లాడారు. కష్టం వచ్చినప్పుడే నాయకుడి విలువ తెలుస్తుంది' అని కేటీఆర్‌ తెలిపారు. కరోనా వచ్చినప్పుడు క్రికెట్ మ్యాచ్ చూసినట్లు కేసీఆర్ ప్రెస్‌మీట్ చూడటం కోసం ప్రజలు ఎదురుచూశారని కేటీఆర్‌ గుర్తుచేశారు.

Also Read: Kishan Reddy: 'అలా అంటే చెంప చెళ్లుమనిపించండి'.. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

'దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి 35 లక్షల మంది కార్మికులు తెలంగాణలో పని చేస్తున్నారు. కార్మికులు అభివృద్ధిలో భాగస్వాములు అని కేసీఆర్ అన్నారు. కార్మికులకు డబ్బులు ఇచ్చి భోజనం పెట్టి ఉచితంగా రైళ్లు పెట్టి కార్మికులను వారిని స్వరాష్ట్రాలకు పంపారు' అని కేటీఆర్‌ వివరించారు. 'బీడీ కార్మికులకు కేంద్ర మంత్రిగా కేసీఆర్ ఇళ్లు ఇచ్చారు. అసంఘటిత రంగంలో కార్మికుల కోసం కేసీఆర్ కేంద్ర మంత్రిగా కమిటీని ఏర్పాటు చేశారు. సఫాయి కార్మికులకు సలాం అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప దేశంలో ఎవరూ లేరు' అని కేటీఆర్‌ వివరించారు. జీహెచ్ఎంసీ సఫాయి కార్మికులకు జీతం మూడుసార్లు పెంచిన ఘనత కేసీఆర్‌కు దక్కిందని గుర్తుచేశారు. అంగన్‌వాడీ టీచర్లను గత ప్రభుత్వాలు గుర్రాలతో తొక్కించారు. అంగన్‌వాడీ టీచర్ల జీతాలు రూ.13 వేలు కేసీఆర్ చేశారు. మినీ అంగన్ వాడీ టీచర్లకు రూ.7,500 చేశారు. ఆశా వర్కర్లకు రూ.9,500 జీతం కేసీఆర్ పెంచారు.

'ఆశా వర్కర్లపై పోలీసులు నేడు దాడులు చేస్తున్నారు. పైన ఉన్న వాడు ఎట్లా ఉంటే కింద అధికారులు అట్లాగే ప్రవర్తిస్తారు. మున్సిపల్ కార్మికులకు మూడు నెలల నుంచి జీతాలు రావడం లేదు. హోంగార్డుల జీతాలు రూ.9 వేల నుంచి రూ.27 వేలు కేసీఆర్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే 73 శాతం జీతాలు కేసీఆర్ పెంచారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీ కేసీఆర్ ఇచ్చారు. అర్చకులకు కేసీఆర్ గౌరవ వేతనం ఇచ్చారు. దేశంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా బీడీ కార్మికులకు పింఛన్ కేసీఆర్ ఇచ్చారు. రాష్ట్రం దివాళా తీసింది అనే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత రాష్ట్ర ఆదాయం మిగులు రూ.5,944 కోట్ల రూపాయలతో కాంగ్రెస్ పార్టీకి అప్పగించాం' అని కేటీఆర్‌ చెప్పారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News