టీఆర్ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలో వివరించిన కేసీఆర్

       

Last Updated : Dec 3, 2018, 02:15 PM IST
టీఆర్ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలో వివరించిన కేసీఆర్

ఖమ్మం: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రచార పర్వంలో కేసీఆర్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.  ప్రజా ఆశిర్వాద కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కేసీఆర్ సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ఈ నాలుగేళ్ల కాలంలో మానవీయ కోణంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని.. అభివృద్ధి విషయంలోనూ దూసుకుపోతున్నామని టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును సమర్థించుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలో తనదైన శైలిలో ప్రజలకు వివరించారు. 

* విద్యుత్ సరఫరాలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాం
* రైతులకు ఉచితంగా 24 గంట విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
* సంక్షేమ రంగంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ముందు వరసలో ఉన్నాం
* ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకం అమలు

* రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి సైతం ప్రశంసించింది
* రైతుల కష్టాలను గుర్తించి రుణమాఫీ చేశాం
* పేదలకు డబుల్ బెడ్ రూం ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాం
* ప్రభుత్వ ఆస్పత్రిలో వసతులు మెరుగుపర్చాం
* వృద్ధులు , వింతంతువులు, వికలాంగులకు ఫించన్లు ఇస్తున్నాం 
* సీతారామ ప్రాజెక్టుతో రెండు పంటకు నీళ్లు  
* సంపద పెంచి  పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నాం
* మిషన్ బగీరథతో నీటి అవసరాలు తీర్చుతున్నాం
* రాష్ట్రంలో అనేక కొత్త  పరిశ్రమలు ఏర్పాటు చేశాం
* హైదరాబాద్ ఐటీ రంగాన్ని మరింత అభివృద్ధి చేశాం

ఇలా నాలుగేళ్ల పాలనలో మానవీయ కోణంలో ఆలోచించి ఎన్నో పథకాలు తీసుకొచ్చామని..అలాగే అభివృద్ధి విషయంలో కూడా శరవేంగా దూసుకువెళ్లున్నామని టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును కేసీఆర్ ఇలా సమర్థించుకున్నారు. 

మళ్లీ చంద్రబాబును వదలని కేసీఆర్
ఈ సందర్భంగా చంద్రబాబును టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాల తీరుపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలకు అడ్డుపడుతున్న చంద్రబాబు పంచన చేరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, టీజేఎస్ పార్టీలు మనకు ఓట్లు అడగడం సిగ్గుచేటని కేసీఆర్ విమర్శించారు. మన మనుగుడను ప్రశ్నిస్తున్న చంద్రబాబుకు మద్దతిచ్చే పార్టీలకు ఓటు వేస్తే తెలంగాణ భవిష్యత్తు అంధకారంలోకి వపడుతుందని ఈ సందర్భంగా కేసీఆర్ హెచ్చరించారు. మన మనుగడను ప్రశ్నించే చంద్రబాబుతో జతకట్టిన మహాకూటమికి ఎన్నికల్లో దారుణంగా ఓడించాలని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రజలను కోరారు.

Trending News