శరవేగంగా కాళేశ్వరం నిర్మించాలి: సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (కేఎల్ఐపీ) కు సంబంధించి అన్ని అనుమతులు ఎంత వేగంగా వచ్చాయో.. అంతేవేగంగా ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలని అధికార యంత్రాగాన్ని ఆదేశించారు.

Last Updated : Dec 10, 2017, 04:51 PM IST
శరవేగంగా కాళేశ్వరం నిర్మించాలి: సీఎం కేసీఆర్

హైదరాబాద్ (తెలంగాణ):  తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (కేఎల్ఐపీ) కు సంబంధించి అన్ని అనుమతులు ఎంత వేగంగా వచ్చాయో.. అంతేవేగంగా ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలని అధికార యంత్రాగాన్ని ఆదేశించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, భూసేకరణ, ఇతర సంబంధిత సమస్యలు పరిష్కరించబడ్డాయి. కాబట్టి ఇక ఏ అడ్డంకులు లేవు. త్వరగా పనులు ప్రారంభించి పూర్తిచేయండని అధికారులను ఆదేశించారు. కేవలం మిగిలింది ఏదైనా ఉందంటే అది పర్యావరణ క్లియరెన్స్ మాత్రమే. అది కూడా తొందరలోనే వస్తుందని ఆయన చెప్పారు.

"అటవీ అనుమతుల క్లియరెన్స్ వచ్చేశాయ్. మిగిలింది ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ మాత్రమే. అది కూడా తుదిదశకు వచ్చేసింది. బడ్జెట్లో రూ.25,000 కోట్లను ప్రాజెక్టుకు కేటాయించాం. దీనితోపాటు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా మరో 20 వేల కోట్ల రూపాయలు ఏర్పాటు చేస్తున్నాం" అని సీఎం చెప్పారు.

తెలంగాణకు ఈ ప్రాజెక్టు జీవనాడి అని అభివర్ణిస్తూ..  ఈ ప్రాజెక్టును ఏడు జిల్లాలలో నీటి సమస్యలను పరిష్కరిస్తుంది, హైదరాబాద్కు తాగునీరు సరఫరా  చేస్తుందని ఆయన అన్నారు.

కాళేశ్వరం పాజెక్టు అంచనా 80,500 కోట్ల రూపాయలు.  కేఎల్ఐపీ తెలంగాణ రాష్ట్రం చేపట్టిన అత్యంత ఖరీదైన నీటిపారుదల ప్రాజెక్టు. కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో 7,38,851 హెక్టార్ల పంటకు సాగునీరు అందిస్తుంది.

2007లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ పథకమే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. మార్పులు, చేర్పులు చేసి ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం తుదిరూపు తీసుకొచ్చింది. ఇదివరకు ఈ ప్రాజెక్టు ఒరిజినల్ ప్లాన్ 16 టీఎంసీ అడుగులు. కానీ ప్రస్తుతం స్టోరేజ్ కెపాసిటీ 148 టీఎంసీ అడుగులు.

Trending News