గన్ తయారు చేయడం ఎలా..గూగుల్ సెర్చ్ చేస్తే చాలా సెకన్ల వ్యవధిలో ఎంతో ఇన్ఫర్ మేషన్ ప్రత్యక్షం ..అలాగే యూట్యూబ్ లో వెతికితే వందల కొద్ది వీడియాలు దర్శనమిస్తాయి. సాంకేతికగా ఈ స్థాయిలో విస్తరించిన నేపథ్యంలో గ్రామ స్థాయిలోనూ విచ్చలవిడిగా తుపాకుల తయారి జరుగుతోంది. వరంగల్ జిల్లాలో దీనికి సంబంధించిన పలు కేసులు నమోదు అయ్యాయి. గూగుల్, యూట్యూబ్ ద్వారా సేకరించిన సమాచారంతో అడ్డగోలుగా నాలుతుపాకులు తయరు చేయడం..ముఠాలుగా ఏర్పడి వాటితో దారి దోపిడీలకు పాల్పడటం జరుగుతోంది.
ప్రముఖ మీడియా ప్రకారం వరంగల్ జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన బొమ్మలు చెక్కే ఓ వ్యక్తి శ్రీనివాస్.. యూట్యూబ్ లో చూసి నాటు తుపాకి తయారు చేశాడు. ఓ గ్యాంకు ను తన వెంట పెట్టుకొని దోపిడీకి పాల్పడటం మొదలెట్టాడు. పలు ఫిర్యాదులు రావడంతో పోలీసులు పగఢ్బంధీ వ్యూహంతో ఈ మూఠాను గట్టు రట్టు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జిల్లాలో పెరుగుతున్న గన్ కల్చర్ పై జనాలు భయాందోళనలకు గురి అవుతున్నారు.
ఈ సందర్భంగా వరంగల్ సీపీ రవీందర్ మాట్లాడుతూ గన్ కల్చర్ ను అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దారి దోపిడీ దొంగల విషయంలో జనాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీస్ కమిషనర్ రవీందర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఓరుగల్లులో గన్ కల్చర్ ..రెచ్చిపోతున్న దోపిడి ముఠాలు !!