శ్రీరామ నవమి : ఆదివారం హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

శ్రీరామ నవమి శోభయాత్ర సందర్భంగా ఈ నెల 25వ తేదీన ఆదివారం నగర కమిషనరేట్ పరిధిలో పలు రహదారులలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో వుంటాయని నగర పోలీస్ కమిషనర్ తెలిపారు.

Last Updated : Mar 24, 2018, 12:44 AM IST
శ్రీరామ నవమి : ఆదివారం హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

శ్రీరామ నవమి శోభయాత్ర సందర్భంగా ఈ నెల 25వ తేదీన ఆదివారం నగర కమిషనరేట్ పరిధిలోని గోషామహల్, సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని పలు రహదారులలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో వుంటాయని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రకటించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు శోభయాత్ర ప్రారంభం అవుతుంది. శోభ యాత్ర అప్పర్ దూల్‌పేట్ మహంకాళేశ్వరి మందిర్ నుంచి గౌలిగూడ రామ్ మందిర్ వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అఫ్జల్‌గంజ్ టి జంక్షన్, రంగమహాల్ వై జంక్షన్, పుత్లీబౌలి ఎక్స్ రోడ్డు, ఆంద్రా బ్యాంకు ఎక్స్ రోడ్డు, డీఎం అండ్ హెచ్‌ఎస్ ఎక్స్ రోడ్స్, సుల్తాన్‌బజార్ ఎక్స్ రోడ్స్, చాదర్‌ఘాట్ ఎక్స్ రోడ్స్, కాచిగూడ ఎక్స్ రోడ్డ్, ఆబిడ్స్ జనరల్ పోస్ట్ ఆఫీస్ కేంద్రాల నుంచి ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించి శోభయాత్ర సాఫీగా సాగేందుకు సహకరించాలి అని సీపీ విజ్ఞప్తి చేశారు.

ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు అమలులో వుండే ప్రాంతాలు, మార్గాలు ఇలా వున్నాయి..
-> అసీఫ్‌ నగర్ వైపు నుంచి బోయిగూడ కమాన్ రూట్‌లో వెళ్లే వాహనాలు మల్లేపల్లి క్రాస్ రోడ్డు నుంచి విజయనగర్ కాలనీ మీదుగా మోహిదీపట్నం వైపు వెళ్లాల్సి వుంటుంది. 
-> బోయిగూడ కమాన్ నుంచి సీతారాంబాగ్ వైపు వెళ్లే వాహనాలకు అనుమతి లేదు. ఈ మార్గంలో వెళ్లాల్సిన వాహనాలు అఘాపురా, హబీబ్‌నగర్ వైపు వెళ్లాల్సి వుంటుంది.
-> అఘాపురా, హబీబ్‌నగర్ వైపు నుంచి సీతారాంబాగ్ వచ్చే మార్గంలో వాహనాలకు ప్రవేశం నిషిద్ధం. ఈ మార్గంలో వెళ్లే వాహనాలను దారుసలాం వైపు మళ్లించేందుకు ఏర్పాట్లు చేశారు.
-> బోయిగూడ కమాన్ నుంచి పురానాపుల్ వెళ్లే వాహనాలను దారుసలాం వద్ద మళ్లిస్తారు.
-> పురానపూల్ నుంచి గాంధీ విగ్రహాం వైపు వెళ్లే వాహనాలకు అనుమతి లేదు. ఈ మార్గంలో వెళ్లే వాహనాలను పురానపూల్ బ్రిడ్జి మీద నుంచి పేట్లబుర్జు లేదా కార్వాన్, కుల్సుంపురా మార్గాల్లో మళ్లిస్తారు.
-> ఎం.జే.బ్రిడ్జి వైపు నుంచి జుమ్మరాత్ బజార్‌వైపు వాహనాలకు అనుమతి లేదు. ఆ వాహనాలను సిటీ కాలేజీ మీదుగా అఫ్జల్‌గంజ్ వైపు మళ్లిస్తారు. 
-> మాలకుంట నుంచి ఎం.జే బ్రిడ్జి వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ రూట్‌లోని వాహనాలను అలస్క నుంచి దారుసలాం వైపు మళ్లిస్తారు.
-> అఫ్జల్‌గంజ్ నుంచి సిద్దిఅంబర్‌బజార్ మార్గంలో వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను నేషనల్ లాడ్జీ వద్ద సాలార్జింగ్ బ్రిడ్జి మీదకు మళ్లిస్తారు. 
-> రంగ్‌మహాల్, కోఠి నుంచి గౌలిగూడ చమాన్ వైపు వెళ్లే వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను జాంబాగ్, ఎంజే మార్కెట్ వైపు మళ్లిస్తారు.
-> అఫ్జల్‌గంజ్ నుంచి ఎం.జే బ్రిడ్జి వైపు వచ్చే వాహనాలను మదీన, సీటీ కాలేజ్ వైపు మళ్లిస్తారు.

Trending News