హైదరాబాద్ కనీస మెట్రో ఛార్జీ రూ.10

    

Last Updated : Nov 12, 2017, 08:38 PM IST
హైదరాబాద్ కనీస మెట్రో ఛార్జీ రూ.10

హైదరాబాద్‌ మెట్రో ఇంకో పక్షం రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానుంది. అయితే టికట్ ధర ఎంత పెట్టే అవకాశం ఉందన్న విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. మెట్రో నిర్మాణ సమయంలో కనీస టికెట్‌ ధర రూ.8గా ఉంటుందని సమాచారం అందినా, ఇంకా అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. అయితే ఈ మధ్యకాలంలోనే ఈ ధరను స్వల్పంగా పెంచారని తెలిసింది.కనీస ధర రూ.10 నిర్ణయించినట్లు కొందరు చెబుతున్నారు.  ప్రభుత్వానికి, ఎల్‌ అండ్‌ టీకి మధ్య ఏకాభిప్రాయం కుదిరాకే కనీస రుసుమును నిర్ణయించారని చెబుతున్నారు. అయితే కనీస చార్జీకి కనీసం ఐదు కిలోమిటర్ల దూరం ప్రయాణించే అవకాశం ఉంటేనే కిట్టుబాటు అవుతుందని ప్రజలు భావిస్తున్నారు. అయితే  తొలి పది రూపాయలకు 2-3 కిలోమిటర్లు ఇస్తామని ఎల్‌ అండ్‌ టీ చెబుతున్నట్లు సమాచారం. అప్పుడు తొలి స్టేషన్‌ నుంచి ఆఖరి స్టేషన్‌ వరకు వెళ్లే ప్రయాణికుల వారి చార్జీ దాదాపు 50 నుండి 60 రూపాయలు ఉంటుంది. 

Trending News