Hyderabad hmwssb offers one time ots 2024 settlement scheme: దసరా పండగ వేళ హైదరాబాదీలకు రేవంత్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. నగరంలో ఉండే చాలా మంది ప్రజలు కొన్నేళ్లుగా వాటర్ బిల్స్ లు కట్టడంలేదని వాటర్ బోర్డుకు పలు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు చాలా ఏళ్లుగా పెరుకుపోయిన పెండింగ్ లను క్లియర్ చేసేందుకు మంచి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ..హెచ్ఎంఎస్ఎస్బీ వాటర్ బోర్డు కార్యదర్శి ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలపై విధించిన ఆలస్య రుసుము, వడ్డీని మాఫీ చేస్తూ వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ (ఓటీ ఎస్)ను ప్రకటించారు. దీనిలో భాగంగా.. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా.. తాగునీటి బిల్ లను కట్టే వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తోంది. ఈ అవకాశం.. ఈ నెల 1 నుంచి 31 వరకు మాత్రమే అమల్లో ఉంటుందని కూడా మున్సిపాల్ ముఖ్యకార్యదర్శి దాన కిషోర్ ఒక ప్రకనటలో వెల్లడించారు.
దసరా పురస్కరించుకొని ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురాగా... ఈనెల 1 నుంచి 31 వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం హైదరబాద్ వ్యాప్తంగా.. వాటర్ బిల్లులు చాలా కోట్లల్లో పెండింగ్ లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇదిలా ఉండగా..
వాటర్ బోర్డులో నీటి బకాయిలు అంతకంతకూ పెరిగిపోతుండటంతో వాటిని తగ్గించేందుకు ఓటీఎస్ ను అమలు చేయాలని వాటర్ బోర్డు గతనెల 19న ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. దీనిపై సర్కారు సానుకూలంగా స్పందించడంతో.. తాజాగా ఉత్తర్వులు వెలువరించినట్లు సమాచారం.
గతంలో .. ఈ పథకాన్ని2016లో, మళ్లీ 2020లో అమలుచేశారు. అప్పుడు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఒక్కో విడతలో రూ. 500 కోట్లకుపైగా బకాయిలు వసూలైనట్లు తెలుస్తోంది. అయితే నీటి బిల్లుల బకా యిలపై వడ్డీ మాఫీ కోసం అధికారుల స్థాయిని బట్టి పరిమితి నిర్ణయించారు.
Read more: Bathukamma Kanuka: బతుకమ్మ కానుకకు మంగళం? చీరలు లేవు, రూ. 500 ఊసే లేదు..!
మేనేజర్ స్థాయిలో రూ.2000 వరకు, డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.2001 నుంచి రూ.10,000 వరకు, జనరల్ మేనే జర్ స్థాయిలో రూ.10,001 నుంచి రూ.1,00,000 వరకు, చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.1,00,001 నుంచి అంతకంటే ఎక్కువ మాఫీ చేసే అధికారం ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొవాలని వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి