Bollywood Star Heroine: స్టార్ కిడ్స్ అంటే గోల్డెన్ స్పూన్ బేబిలని అందురు అనుకోవడం సహజం. కానీ కొన్నిసార్లు వాళ్లు కూడా సామాన్యుల్లా కష్టాలు పడ్డ సందర్భాలుంటాయి. స్టార్ నటీనటులు ఒకానొక టైమ్ లో సినిమాలు తీసి డబ్బులు పోగొట్టుకున్నపుడు వారి బతుక బస్టాండ్ అయిన సందర్భాలు కోకొల్లలు.
Bollywood Star Heroine: స్టార్ కిడ్స్ అంటే గోల్డెన్ స్పూన్ బేబిలని అందురు అనుకోవడం సహజం. కానీ కొన్నిసార్లు వాళ్లు కూడా సామాన్యుల్లా కష్టాలు పడ్డ సందర్భాలుంటాయి. స్టార్ నటీనటులు ఒకానొక టైమ్ లో సినిమాలు తీసి డబ్బులు పోగొట్టుకున్నపుడు వారి బతుక బస్టాండ్ అయిన సందర్భాలు కోకొల్లలు.
కరీనా కపూర్.. హిందీ చిత్రసీమను శాసించిన.. శాసిస్తున్న కపూర్ ఫ్యామిలీకి చెందిన కుమార్తె. బాలీవుడ్ షో మ్యాన్ రాజ్‌కపూర్ మనవరాలు.. రణ్‌ధీర్ కపూర్, బబితల చిన్న కూతరుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
కరీనా కపూర్ 1980లో జన్మించింది. ఆమె అక్క కరిష్మా కపూర్ కూడా బాలీవుడ్ స్టార్ కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. ఓసారి రణ్‌ధీర్ కపూర్ 'ది కపిల్ శర్మ షో'లో 80లలో తమ ఫ్యామిలీ ఫేస్ చేసిన కష్టాలను ప్రస్తావించారు.
అప్పట్లో వరుస ఫ్లాపుల తర్వాత తన ఇద్దరు కూతుళ్ల స్కూల్ ఫీజు కట్టడానికి తన దగ్గర డబ్బు లేవనే విషయాన్ని ఈ షోలో రణ్‌ధీర్ కపూర్ చెప్పాడు. 2011లో కూడా కరీనా అప్పటి విషయాలను మరోసారి గుర్తు చేసుకున్నారు. సినిమాల మూలంగా వచ్చిన నష్టాలతో తమ ఫ్యామిలీ అప్పట్లో ఫేస్ చేసిన ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్ ను వెల్లడించింది.
కరీనా కపూర్.. 2000లో అభిషేక్ బచ్చన్ హీరోగా నటించిన 'రెఫ్యూజీ' చిత్రంతో హిందీ చిత్రసీమలో అడుగు పెట్టింది. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా దేశంలోనే అత్యధిక పారితోషకం తీసుకునే కథానాయికగా ఎదిగింది.
ఇప్పటికీ కరీనా కపూర్ ఒక్కో సినిమాకు రూ. 8 కోట్ల నుంచి రూ. 18 కోట్ల పారితోషకం తీసుకుంటుందనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం కరీనా కపూర్ కు పేరు మీదున్న ఆస్తుల విలువ రూ. 480 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
కరీనా కపూర్ 2012లో తన తోటి నటుడు సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత ఆమె బేగం ఆఫ్ పటౌడీగా మారింది. ఇక రీసెంట్ గా కరీనా భర్త సైఫ్ పై ఓ బంగ్లా దేశీయుడు కత్తితో వెన్నులో పొడిచిన సంఘటన సంచలనం రేపింది.
ప్రస్తుతం కరీనా కపూర్ నివాసం ఉంటున్న పటౌటీ ప్యాలెస్ విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ. 800 కోట్ల నుంచి రూ. 1000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అందులో తన భర్త, ఇద్దరు కుమారులతో కలిసి ఉంటుంది.