Telangana Rains: మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు

గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలకు మరో భారీ వర్షం (Heavy Rains In Telangana) ముప్పు పొంచి ఉంది. ఇదివరకే హైదరాబాద్ రోడ్లు జలశయాలను తలపిస్తున్నాయి. ఇక మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.

Last Updated : Sep 18, 2020, 08:10 AM IST
  • ఆదివారం నుంచి తెలంగాణలో కుండపోత వర్షాలు
  • గ్రేటర్ హైదరాబాద్‌లో నగరజీవనం అస్తవ్యస్తం
  • జలశశాలను తలపిస్తున్న రోడ్లు, ప్రజలకు ఇక్కట్లు
  • తాజాగా మరో అల్పపీడనం, రెండు రోజుల పాటు వానలు
Telangana Rains: మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు

గత నాలుగు నాలుగు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు (Heavy Rains In Telangana) కురుస్తున్నాయి. తాజాగా ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరో రెండు రోజులు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలలో 2.1 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లోనూ దాదాపు 3 కిలోమీటర్ల ఎత్తు వరకు మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. Gold Price: భారీగా తగ్గిన బంగారం ధరలు.. క్షీణించిన వెండి

ఈశాన్య బంగాళాఖాతంలోనూ ఈ వారాంతం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా శుక్రవారం, శనివారాల్లో (నేడు, రేపు) తెలంగాణ వ్యాప్తంగా వానలు కురిసే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌ (Rains In Hyderabad)తో పాటు రాష్ట్రంలోని 19 జిల్లాలకు భారీ వర్ష సూచనను వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. Virat Kohli: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ‘టాప్’ లేపిన విరాట్ కోహ్లీ

కాగా, నేడు హైదరాబాద్‌లో భారీగా వర్షం కురవనుంది. ఎడతెగని వానతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీజనల్ వ్యాధులతో పాటు కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ICSI CSEET Results 2020: క‌ంపెనీ సెక్రెట‌రీ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి  

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News