Ganesh immersion controvercy at hussainsagar: దేశంలో గణేష్ నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. మరోవైపు.. హైదరాబాద్ లో కూడా వినాయకుల ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. మరోవైపు కొంత మంది గణేష్ లను నిమజ్జనం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి ఏడాది కూడా నిమజ్జనం సమయంలో.. హుస్సెన్ సాగర్ లో వినాయకుల్ని వేయడం వల్ల.. నీళ్లన్ని కలుషితం అవుతాయని, నీటిలో ఉండే జలచరాలతో పాటు, ప్రజలు కూడా ఇబ్బందులు పడుతారంటూ కూడా అనేక ఘటనలు వార్తలలో ఉంటాయి.
గతంలో కూడా హైకోర్టు అనేక సందర్భాలలో.. హుస్సెన్ సాగర్ లో పీఓపీ విగ్రహాలు కాకుండా.. ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకొవాలని కూడా ఆదేశించింది. కానీ ప్రభుత్వాలు మాత్రం.. గణపటి నవరాత్రులు వచ్చినప్పుడు ఏదో హాడావిడి చేస్తాయి.. ఆ తర్వాత శరమాములేగా.. అన్నట్లుగా ఉంటున్నాయి. ఈ క్రమంలో మరోసారి హైకోర్టులో లాయర్ వేణు మాధవ్ ఒక పిటిషన్ ను దాఖలు చేశారు. హైదరబాద్ లో గణేష్ నిమజ్జనంపై గతంలో హైకోర్టు ఇచ్చిన సూచనల్ని మరోసారి ఆయన కోర్టు ముందు ఉంచారు.
అంతేకాకుండా.. ఈ కేసులో ప్రతివాదిగా హైడ్రాను కూడా చేర్చారు. దీంతో హుస్సెన్ సాగర్ లో గణపయ్యలను నిమజ్జనం చేయకూడదంటూ కూడా ఫ్లెక్సీలు వెలిశాయి. అంతేకాకుండా.. హుస్సెన్ సాగర్ చుట్టు లోపలికి పోకుండా.. బారికెడ్లు సైతం ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ, హైదరబాద్ పోలీసుల పేరుతో ఫ్లెక్సీలు ఏర్పడటంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది.
దీనిపై జీహెచ్ఎంసీ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు . మరోవైపు ఈరోజు తెలంగాణ హైకోర్టులో.. హుస్సెన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం పిటిషన్ విచాణకు రానున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి ఆదేశాలు వెడువడుతాయో అని.. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.