Fake Seeds Alert: రైతులకు బిగ్ అలర్ట్.. మార్కెట్లోకి అచ్చం ఒరిజినల్ లాంటి నకిలి విత్తనాలు

Fake Seeds Alert Farmers : నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడుతున్న రెండు ముఠాలను అరెస్టు చేసి వారి నుంచి 2 కోట్ల రూపాయల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా కేంద్రంగా నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడుతున్న 2 ముఠాలకు చెందిన పదిహేను మంది నిందితులను టాస్క్‌ఫోర్స్, మడికొండ, ఏనుమాములు పోలీసులు, వ్యవసాయశాఖ విభాగం అధికారులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించి అరెస్ట్ చేశారు.

Written by - Pavan | Last Updated : Jun 9, 2023, 06:27 AM IST
Fake Seeds Alert: రైతులకు బిగ్ అలర్ట్.. మార్కెట్లోకి అచ్చం ఒరిజినల్ లాంటి నకిలి విత్తనాలు

Fake Seeds Alert Farmers : నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడుతున్న రెండు ముఠాలను అరెస్టు చేసి వారి నుంచి 2 కోట్ల రూపాయల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా కేంద్రంగా నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడుతున్న 2 ముఠాలకు చెందిన పదిహేను మంది నిందితులను టాస్క్‌ఫోర్స్, మడికొండ, ఏనుమాములు పోలీసులు, వ్యవసాయశాఖ విభాగం అధికారులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించి అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారు. అరెస్ట్ అయిన నిందితుల నుంచి 2 కోట్ల 11 లక్షల విలువ కలిగిన నకిలీ విత్తనాలు, ఏడు టన్నుల విడి విత్తనాలు, 9వేల 765 నకిలీ విత్తనాల ప్యాకేట్లు, ఒక డిసియం, ఒక కారు, 21 లక్షల రూపాయల నగదు, నకిలీ విత్తనాల ప్యాకేట్ల తయారీ కొరకు అవసరమయిన వస్తుసామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ వివరాలను మీడియాకు వెల్లడిస్తూ ఒక ముఠాలోని సభ్యులు రైతుల నుండి తక్కువ ధరకు విడిగా విత్తనాలు కొనుగోలు చేసి, వాటిని ఈ ముఠాలోని ప్రధాన నిందితులు దాసరి శ్రీనివాస రావు, భాస్కర్ రెడ్డి కర్ణాటకలో నిర్వహిస్తున్న విత్తన కంపెనీలకు తరలించి అక్కడ విత్తన శు ద్ధి చేసేవారు. శుద్ధి చేసిన నకిలీ విత్తనాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేదించిన బి.జి. 3. ఎచ్ టి పేరుగల పత్తి విత్తనాలు గడ్డి మందును తట్టుకొని, ఎక్కువమార్లు కలుపు తీయాల్సి అవసరం ఉందడని, ఈ విత్తనాలు అధికృత డీలర్ల వద్ద విక్రయాలకు వుండవంటూ రైతులను ఎక్కువ ధరలకు వివిధ రకాల పేరున్న విత్తన కంపెనీల పేర్లతో ఆకర్షణీయంగా ప్యాక్ చేసి వాటిని వరంగల్ నగరానికి తీసుకువచ్చి విక్రయించే వారు. ఇక్కడి నుండి తెలంగాణ, మహరాష్ట్రల్లోని జిల్లాలకు చెందిన విత్తన డీలర్లకు, రైతులకు ఈ ముఠా విక్రయాలు జరిపేది.

మరో ముఠాకు సంబంధించిన ప్రధాన నిందితుడు చేదాం పాండు ప్రభుత్వ అనుమతులు కలిగిన రుషి, శ్రీగణేష్ విత్తన శుద్ది కంపెనీలు వున్నాయి. ఈ కంపెనీ ద్వారా గుజరాత్ రాష్ట్రంలోని నర్మదాసాగర్ కంపెనీ నుండి దిగుమతైన విత్తనాలను ఈ కంపెనీల ద్వారా ఉప విక్రయ లైసెన్స్ దారుడిగా ఉంటూ తెలంగాణలోని వివిధ జిల్లాలకు విత్తనాలు విక్రయించేవాడు. ఇదే అదునుగా భావించిన ఈ నిందితుడు మరి కొందరితో కలిసి సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. ఇందుకోసం ఈ ముఠా సభ్యులు అసలైన నర్మద కంపెనీ చెందిన విత్తన ప్యాకేట్లను తీసిపోని విధంగా క్యూఆర్ కొడ్, విత్తన తయారీ, గడువు తారీఖులు, క్రమ సంఖ్య, యం.ఆర్.పిలతో కూడిన నకిలీ నర్మదా విత్తన ప్యాకేట్ల తయారు చేసిన వీటిలో నకిలీ విత్తనాలు ఉంచి ఈ నకిలీ నర్మద కంపెనీ విత్తన ప్యాకేట్లను మరికొందరు నిందితుల సహకారంతో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో విక్రయించేవారు. పోలీసులకు పక్కా సమాచారం అందించడంతో టాస్క్‌ఫోర్స్, మడికొండ, ఎనుమాముల, వ్యవసాయశాఖ అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి నిన్నటి రోజున నిందితులను అరెస్టు చేసి విచారించగా నిందితులు పాల్పడిన నేరాలన్ని అంగీకరించారు.

Trending News