BLAST: నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిట్యాల మండలం వెలిమినేడు వద్ద గల హిందీస్ రసాయన పరిశ్రమలో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు రియాక్టర్ పేలింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. ఒకరు చనిపోయారని సమాచారం. క్షతగాత్రులను పరిశ్రమ యాజమాన్యం హాస్పిటల్ కు తరలించింది. మృతుల సంఖ్య పెరగవచ్చని తెలుస్తోంది.
పరిశ్రమలోని బి బ్లాక్ లో పేలింది రియాక్టర్. కంపెనీ దగ్గరికి ఎవరిని అనుమతించడం లేదు యజమాన్యం. రియాక్టర్ పేలుడుతో పెద్ద ఎత్తున మంటలతో పాటు దట్టమైన పొగ అలుముకుంది. ఈ ప్రభావంతో శివారు ప్రాంతమంతా భారీగా పొగ కమ్మేసింది. దాంతో స్థానిక జనం భయాందోళనకు గురైంది. వెలిమినేడు, పిట్టంపల్లి, బాంగోని చెర్వు, పేరేపల్లి, గుండ్రంపల్లి, పెద్దకాపర్తి సమీప గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. కంపెనీ నిర్వాహకుల నిర్లక్ష్యంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.నిబంధనలు పాటించక పోవడమే ప్రమాదానికి కారణమంటున్నారు స్థానికులు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి