Telangana Politics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి బీఆర్‌ఎస్ పార్టీ గుణపాఠాలు నేర్చుకుంటున్నట్లు ఉంది. కేసీఆర్ హయాంలో అభివృద్ధిపై జనంలో అసంతృప్తి లేకున్నా.. బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు జనానికి అందుబాటులో ఉండరన్న అపవాదు ఉంది. ముఖ్యంగా కేసీఆర్ ఫామ్‌హౌస్, ప్రగతిభవన్‌లకే పరిమితం అవుతున్నారంటూ అప్పటి విపక్ష పార్టీలు చేసిన ప్రచారం జనంలోకి బాగా వెళ్లింది. కర్ణుడి చావు అనేక కారణాలన్నట్లు.. బీఆర్‌ఎస్ పరాజయానికి ఇదే కారణంగా మారింది. అందుకే బీఆర్‌ఎస్ ఇప్పుడు రూట్ మార్చినట్లు తెలుస్తోంది.
త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో బీఆర్‌ఎస్ ముఖ్యనేతలు జనం మద్దతు కోసం ప్రజాబాట పట్టారు. ప్రజల వద్దకు వెళ్లి సామాన్యులతో కలిసిపోతూ వారి కష్ట సుఖాలు తెలుసుకుంటున్నారు. ఒకవైపు ఆరు గ్యారంటీలు, ఎన్నికల హామీల అమలు ఎప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మరోవైపు కొత్త ప్రభుత్వ పాలన ఎలా ఉందంటూ జనాన్ని ఆరా తీస్తున్నారు. బీఆర్ఎస్ ముఖ్యనేతలైన కేటీఆర్, హరీశ్ రావు వ్యవహార శైలి రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. న్యూఇయర్ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. తెలంగాణ భవన్‌లో వారితో ప్రత్యేకంగా భేటీ అయ్యి కాసేపు ముచ్చటించారు. వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. వారితో సెల్ఫీలు దిగారు.
మరోవైపు మాజీ మంత్రి హరీశ్‌రావు మెట్రో రైల్‌లో సందడి చేశారు. ఎల్బీనగర్ నుంచి లకిడికాపూల్ వరకు ఆయన ప్రయాణించారు. మెట్రోలో ప్రయాణించినంత సేపు సరదాగా ప్రయాణికులతో ముచ్చటించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు ఇటీవల సిద్దిపేటలో రోడ్డు పక్కన ఉన్న టిఫిన్ బండి దగ్గర ఆగి ఇడ్లీలు తిన్నారు. స్థానిక యువతతో కలిసి సంభాషించారు.
మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఇలా జనంలో కలిసిపోతుండటం ఆసక్తిని రేపుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంగా టీఆర్‌ఎస్ అడుగులు వేస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో 9 స్థానాలను గెలిచిన గులాబీ పార్టీ.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాస్త చతికిలబడినట్లు అనిపించింది. దాంతో మళ్లీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు సైతం కేటీఆర్, హరీశ్‌రావు యాక్టివ్ అయ్యారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తొమ్మిది సిట్టింగ్ స్థానాలకు అదనంగా మరికొన్ని ఎంపీ సీట్లు గెలుచుకోవాలన్న బీఆర్‌ఎస్ లక్ష్యం నెరవేర్చేందుకు ప్రజల బాట పట్టినట్లు తెలుస్తోంది.
Also Read: Yatra 2 Movie: యాత్ర-2 టీజర్ వచ్చేస్తోంది.. పోస్టర్ రిలీజ్
Also Read: Petrol And Oil Tankers: వాహనదారులకు గుడ్‌న్యూస్.. పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ల సమ్మె విరమణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter