Palamuru Development: 'రైతు పండుగ పేరుతో కొడంగల్‌లో భూములు ఇవ్వకుండా గిరిజన రైతులు ఎదురు తిరిగినందుకు రాష్ట్రంలోని రైతులను బెదిరించేందుకు ఈ సభ పెట్టినట్లుంది' అని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. మీరు ఇవ్వకున్నా నేను గుంజుకోవడం ఖాయం అని రేవంత్ బహిరంగంగా బెదిరించినట్లు ఉందని పేర్కొన్నారు. పాలమూరు మీద ప్రేమ ఉంటే ఏడాది కాలాన్ని ఎందుకు హారతి కర్పూరంలా కరిగించావు అని గుర్తుచేశారు.
Also Read: Harish Rao: కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల ఫామ్‌హౌజ్ లేకుంటే రేవంత్ రాజీనామా చేస్తావా?
పాలమూరులో నిర్వహించిన రైతు పండుగ సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను శనివారం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఏడాదిగా రేవంత్‌కు పాలమూరు మీద ధ్యాసనే లేదు. రేవంత్ చేస్తున్న సంబరాలు చూసి ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు' అని తెలిపారు. 'నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే నిమిష నిమిషం కృష్ణానీళ్లను ఒడిసిపట్టి ఉండేవాడివి. అది లేకనే ఈ ఏడాది కృష్ణా నీళ్లకు అవకాశం ఉన్నా వాడుకోలేక సముద్రం పాలు చేశావు' అని మండిపడ్డారు,
Also Read: BRS Party: తెలంగాణ తల్లికి కిరీటం తీసేస్తే దేవుళ్లకు కూడా కిరీటం తీస్తారా?
'పాలమూరు తపన, పాలమూరు ధ్యాస, పాలమూరు వేదన ఎక్కడా నీలో ప్రజలకు కనిపించలేదు. రేవంత్ సీఎం అయ్యాక ఏడాది పాలనలో పాలమూరు జిల్లాలో తట్టెడు మట్టి ఎత్తింది లేదు' అని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గుర్తుచేశారు. 'పాలమూరు వలసలకు కారణమే కాంగ్రెస్ పాలన. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు పచ్చబడింది' అని తెలిపారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో పాలమూరు మళ్లీ వెనకబడిందని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పడావుపెట్టి ఏడాది కావొస్తోందని రేవంత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
'వట్టెం పంప్ హౌస్ మునిగితే ఇప్పటివరకు ఒక్క మంత్రి ఇటువైపు కన్నెత్తి చూడలేదు. నేను పాలమూరు బిడ్డను, నాకు బాధ్యత ఉంది అంటూ రేవంత్ హూంకరించడం హాస్యాస్పదంగా ఉంది' అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు. 'రేవంత్ కు పాలమూరు బాధ తెల్వదు.. ముఖ్యమంత్రిగా బాధ్యత కూడా లేదు' అని మండిపడ్డారు. రైతు పండగ పేరుతో వందల కోట్లు దుర్వినియోగం చేశారన్నారు. పాలమూరు సభలో రేవంత్ ప్రసంగం ఆత్మస్తుతి, పరనిందలా సాగిందని అభివర్ణించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter