KCR Bus Checkup: పొలంబాటలో కేసీఆర్‌కు ఈసీ షాక్‌.. బస్సు అణువణువు తనిఖీ

KCR Bus Checkup In Polambata Suryapet District: బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఎన్నికల సంఘం షాకిచ్చింది. కరువుతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో ఆయన బస్సును తనిఖీ చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 31, 2024, 04:07 PM IST
KCR Bus Checkup: పొలంబాటలో కేసీఆర్‌కు ఈసీ షాక్‌.. బస్సు అణువణువు తనిఖీ

KCR Bus Inspection: సార్వత్రిక ఎన్నికల నియమావళి అమల్లో ఉండడంతో ఎన్నికల సంఘం పోలీసుల సహకారంతో ఎక్కడికక్కడ వాహనాల తనిఖీ చేస్తోంది. సాధారణ ప్రజలతోపాటు వీఐపీల వాహనాలు కూడా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ వాహనాల శ్రేణిని కూడా తనిఖీ చేశారు. బస్సు తనిఖీతో గులాబీ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. 

Also Read: KTR Fire:కేకే, కడియం వంటి వాళ్లు మళ్లీ వచ్చి కేసీఆర్‌ కాళ్లు పట్టుకున్నా తిరిగి రానివ్వం: కేటీఆర్‌

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక సాగునీరు రైతులకు అందింవ్వడం లేదనే విషయం తెలిసిందే. సాగు నీరు లేక పంటపొలాలు ఎండుతుండడంతో రైతులు కరువు కాలం ఎదుర్కొంటున్నారు. పంటలు పండక ఇబ్బందులు పడుతున్న కథనాలు కన్నీరు తెప్పిస్తున్నాయి. రైతుల దయనీయ స్థితిని చూసిన బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పరామర్శకు బయల్దేరారు. ఆదివారం మూడు జిల్లాల్లో పర్యటించారు. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో ఎన్నికల అధికారులు అడ్డు పడ్డారు.

Also Read: Taj Mahal Temple: తాజ్‌మహల్‌పై మళ్లీ అదే వివాదం.. శివాలయంగా ప్రకటించాలని డిమాండ్‌

 

సూర్యాపేట జిల్లా ఈదులపర్రె తండా వద్ద ఏర్పాటుచేసిన చెక్‌ పోస్టు ఎన్నికల అధికారులు కేసీఆర్‌ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపారు. పోలీసుల సహకారంతో అధికారులు తనిఖీలు చేశారు. బస్సు లోపల మొత్తం పోలీసులు తనిఖీలు చేశారు. వారికి కేసీఆర్‌ సంపూర్ణ సహకారం అందించారు. ఎలాంటి అనుమానిత, నిషేధిత, ప్రలోభపూరిత వస్తువులు లేకపోవడంతో పోలీసులు తనిఖీలు ముగించారు. తనిఖీకి సహకరించిన కేసీఆర్‌కు పోలీసులు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్‌ వెంట ఉన్న వాహనాలను కూడా తనిఖీ చేశారు. అనంతరం కేసీఆర్‌ సూర్యాపేట జిల్లాలో రైతులను పరామర్శించేందుకు ముందుకు వెళ్లారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News