EC Shock to BRS Party: బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం..

Election Commission Shock to BRS Party: బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలని చూస్తోన్న బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆ స్థాయిలో గుర్తింపు దక్కలేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 13, 2023, 11:14 AM IST
EC Shock to BRS Party: బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం..

Election Commission Shocks to BRS Party: భారత రాష్ట్ర సమితి పార్టీ పేరుతో ఏపీతో పాటు జాతీయ రాజకీయాల్లో ఒక వెలుగు వెలగాలని చూస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి కేంద్ర ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో రాష్ట్ర పార్టీగా కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. తమది జాతీయ పార్టీ అని, జాతీయ రాజకీయాల్లోకి అడుగిడుతున్నానని హంగూఆర్బాటం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఒక రకంగా ఇది ఇబ్బందికరమైన పరిణామమే అవుతుంది అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 

తెలంగాణతో పాటు ఏపీలోనూ తమ మనుగడ చాటుకోవాలని చూసిన కేసీఆర్‌కి అక్కడ కూడా ఎన్నికల సంఘం వైపు నుంచి నిరాశే ఎదురైంది. ఏపీలోనూ బీఆర్ఎస్ పార్టీకి గుర్తింపును రద్దు చేస్తున్నట్టు ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. దీంతో కనీసం పొరుగు రాష్ట్రమైన ఏపీలో కూడా బీఆర్ఎస్ పార్టీకి పొలిటికల్ డెబ్యూ అవకాశం లేకుండా పోయింది. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసిన ఆ పార్టీ అధినేత కేసీఆర్.. మాజీ ఐఏఎస్ అధికారి, వైసీపీలో కొన్నాళ్లు, జనసేన పార్టీలో కొన్నాళ్లు కొనసాగిన తోట చంద్రశేఖర్ ఏపీలో బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిగా నియమించిన సంగతి తెలిసిందే. 

ఇది కూడా చదవండి: Grain procurement: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. రేపటి నుంచే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

ఇటీవలే విశాఖలో పర్యటించిన తోట చంద్రశేఖర్.. విశాఖ వాసులను ఉద్దేశించి మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవడం కోసం కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేయనున్నట్టు ప్రకటించారు. విశాఖ వాసులు తమతో కిలిసి రావాల్సిందిగా పిలుపునిచ్చారు. మరి తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం ఏపీలో బీఆర్ఎస్ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపనుంది అనేది ప్రస్తుతం రాజకీయవర్గాల్లో చర్చనియాంశమైంది.

ఇది కూడా చదవండి: Bandi Sanjay Comments: వరంగల్ సీపీ అంతు తేలుస్తా.. అవినీతి బాగోతమంతా తీస్తున్నా: బండి సంజయ్ ఫైర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News