COVID-19 in Telangana: తెలంగాణలో విద్యా సంస్థల మూసివేతపై సర్కార్ కీలక నిర్ణయం

Schools and colleges in Telangana: హైదరాబాద్: తెలంగాణలో విద్యా సంస్థలు పునఃప్రారంభించిన అనంతరం విద్యా సంస్థల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థల్లో పెరుగుతున్న కరోనా కేసులకు చెక్ పెట్టేందుకు రేపటి నుంచి తాత్కాలికంగా విద్యాసంస్థలను మూసివేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో (TS Assembly session) ప్రకటించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 23, 2021, 07:38 PM IST
  • తెలంగాణలో Schools, colleges పునఃప్రారంభించిన అనంతరం విద్యా సంస్థల్లో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.
  • విద్యా సంస్థల్లో పెరుగుతున్న కరోనా కేసులకు చెక్ పెట్టేందుకు Telangana govt కీలక నిర్ణయం.
  • తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కీలక ప్రకటన చేసిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
COVID-19 in Telangana: తెలంగాణలో విద్యా సంస్థల మూసివేతపై సర్కార్ కీలక నిర్ణయం

Schools and colleges in Telangana: హైదరాబాద్: తెలంగాణలో విద్యా సంస్థలు పునఃప్రారంభించిన అనంతరం విద్యా సంస్థల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థల్లో పెరుగుతున్న కరోనా కేసులకు చెక్ పెట్టేందుకు రేపటి నుంచి తాత్కాలికంగా విద్యాసంస్థలను మూసివేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో (TS Assembly session) ప్రకటించారు. తెలంగాణ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం మెడికల్‌ కాలేజీలు (Medical colleges) మినహా మిగతా అన్ని విద్యాసంస్థలకు వర్తిస్తుందని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్పష్టంచేశారు. 

విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేస్తున్నప్పటికీ.. అంతకుముందులాగే ఆన్‌లైన్‌ క్లాసులు (Online classes) యథావిధిగా కొనసాగుతాయని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీఎం కేసీఆర్‌తో సమావేశమై విద్యాసంస్థల్లో కరోనా వ్యాప్తిపై పరిస్థితిని వివరించారు.

Also read : Corona Vaccine: దేశంలో 45 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా కరోనా టీకాలు, ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News