తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ‘దోస్త్’ (Degree Online Services, Telangana) ప్రక్రియ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసిన దోస్త్ (DOST) ప్రక్రియ మూడో విడతలో భాగంగా అక్టోబర్ 9వ తేదీ వరకు రిజిష్ట్రేషన్లు చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్లకు తుది గడువు అక్టోబర్ 10వ తేదీన ముగియనుంది. దరఖాస్తు ఫీజుగా విద్యార్థులు రూ.200 చెల్లించి దోస్త్ లో రిజస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కరోనా కారణంగా ఈ ఏడాది నోటిఫికేషన్ ఆలస్యమైందని తెలిసిందే.
Also Read : YSRCP ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి రెండోసారి కరోనా.. ఏపీలో తొలి కేసు
మూడో విడతలో రిజస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు అక్టోబర్ 15న సీట్ల కేటాయిస్తామని దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. ఇప్పటివరకూ జరిగిన తొలి, రెండో విడత దోస్త్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా 1,53,547 మంది విద్యార్థులకు అడ్మిషన్ లభించింది. చివరిదైన మూడో విడతలో మరికొందరు విద్యార్థులకు అడ్మిషన్ దొరకనుంది. దోస్త్ వెబ్సైట్ (DOST Website)
కాగా, ‘దోస్త్’ (DOST Admission 2020) ద్వారా ఉస్మానియా, మహాత్మాగాంధీ, కాకతీయ, పాలమూరు, తెలంగాణ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు.
Also Read : Cyberabad Commissioner: సజ్జనార్ ఫెవరెట్ క్రికెటర్ ఎవరో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe