Crime News, Malkajgiri Police Arrested Bike and LapTop Robbers: హైదరాబాద్ నగరంలో రోజురోజుకు దొంగతనాలు చేసే కేటుగాళ్లు ఎక్కువైపోయారు. జాల్సాలకు అలవాటు పడి.. ఈజీగా డబ్బు సంపాందించేందుకు దొంగతనాలకు పాల్పడుతున్నారు. నగరంలో నిత్యం రద్ఢిగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకుని బైక్ చోరిలకు పాల్పడుతున్న ఇద్దరి వ్యక్తులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గరనుంచి భారీగా ద్విచక్ర వాహనాలు, ల్యాప్ టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు.
మల్కాజ్‌గిరి డీసీపీ రక్షిత మూర్తి తెలిపిన వివరాల ప్రకారం... ఘట్‌కేసర్ పరిసర ప్రాంతాల్లో రోడ్డుపై అనుమాన్సదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి విచారించగా.. వారి వద్ద 11 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చిందం రాజు (25) ఈ కేసులో A1 గా ఉన్నాడని డీసీపీ తెలిపారు. రాజు పెయింటర్ పని చేస్తాడని చెప్పారు. జాల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడినట్లు రక్షిత మూర్తి పేర్కొన్నారు. చిందం మహేష్ A2 నిందితుడిగా ఉన్నట్లు డీసీపీ చెప్పారు. మహేష్ కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడని, ఇతడు కూడా దురాలవాటుకు బానిసై దొంగతనాలను చేసినట్లు రక్షితమ మూర్తి తెలిపారు.
ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో కూడా బైక్ చోరీ కేసులను నమోదు చేసినట్లు డీసీపీ రక్షిత మూర్తి పేర్కొన్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులు ఉన్నట్లు తెలిపారు. సిద్దగొని అభినవ్ (19) ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తూ చేడు అలవాటులకు బానిస అయినట్లు తెలిపారు. ఈ కేసులో ఓ బాలుడు కూడా ఉన్నట్లు గుర్తించి.. వారి దగ్గర ఉన్నట్లు వంటి 16 బైక్ లను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారన్నారు.
తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ ల్యాప్ టాప్‌లను దొంగతనం చేసిన ముఠాను అరెస్ట్ చేసినట్టు డీసీపీ రక్షిత మూర్తి తెలిపారు. నిందితుడు దేవసోత్ దిలిప్ రాతోడ్ (24) ఘట్ కేసర్ పరిసరా ప్రాంతాల్లో అనుమాన్సదంగా తిరుగుతుండడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో భాగంగా నాగారం, కీసర, ఘట్‌కేసర్ ప్రాంతాల్లో తాళం వేసిన ఇండ్లలో చోరబడి నిందితుడు దొంగతనం చేశాడట. నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న 17 ల్యాప్ టాప్‌లను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. కేసును చేధించిన పోలీస్ అధికారులను డీసీపీ అభినందించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.