Telangana: పెరిగిన కరోనా పరీక్షలు.. తగ్గిన COVID-19 పాజిటివ్ కేసులు

COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్స్ (TS Health bulletin) స్పష్టంచేస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 6, 2021, 04:45 AM IST
Telangana: పెరిగిన కరోనా పరీక్షలు.. తగ్గిన COVID-19 పాజిటివ్ కేసులు

COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్స్ స్పష్టంచేస్తున్నాయి. శనివారం విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం 24 గంటల్లో 1,38,182 మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా.. అందులో కొత్తగా 2,070 మందికి కొవిడ్-19 పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 5,89,734 కి చేరింది.

హెల్త్ బులెటిన్‌లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొన్న వివరాల ప్రకారం రాష్ట్రంలో గత 24 గంటల్లో 18 మంది కరోనాతో చనిపోయారు. తాజాగా నమోదైన మరణాలతో కలిసి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 3,364 మంది కరోనాతో మృతి చెందారు. అదే సమయంలో 3,762 మంది కరోనా వైరస్ (Coronavirus) నుంచి కోలుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 

ప్రస్తుతం రాష్ట్రంలో 29,208 కరోనా (COVID-19) యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే దేశంలో కరోనా రికవరీ రేటు 93.3 శాతంగా ఉండగా.. రాష్ట్రంలో రికవరీ రేటు 94.47 శాతంగా ఉంది.

Trending News