Corona Updates in Telangana: తెలంగాణలో ఫోర్త్ వేవ్‌ బెల్స్‌..పెరుగుతున్న రోజువారి కేసులు..!

Corona Updates in Telangana: దేశవ్యాప్తంగా కరోనా కలవర పెడుతోంది. గతకొంతకాలంగా రోజువారి కేసులో పెరుగుదల కనిపిస్తోంది. దీంతో దేశంలో ఫోర్త్ వేవ్‌ బెల్స్‌ మోగుతున్నాయి.

Written by - Alla Swamy | Last Updated : Jun 29, 2022, 08:37 PM IST
  • దేశవ్యాప్తంగా కరోనా కలవరం
  • తెలంగాణలోనూ టెర్రర్
  • పెరుగుతున్న కేసులు
Corona Updates in Telangana: తెలంగాణలో ఫోర్త్ వేవ్‌ బెల్స్‌..పెరుగుతున్న రోజువారి కేసులు..!

Corona Updates in Telangana: దేశవ్యాప్తంగా కరోనా కలవర పెడుతోంది. గతకొంతకాలంగా రోజువారి కేసులో పెరుగుదల కనిపిస్తోంది. దీంతో దేశంలో ఫోర్త్ వేవ్‌ బెల్స్‌ మోగుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్‌ చోరలు చాస్తోంది. తెలంగాణలో తాజాగా 485 కొత్త కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో 27 వేల 130 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా..485 మందిలో వైరస్ తేలింది.

కొత్తగా కోవిడ్ నుంచి 236 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 4 వేల 421 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల కేసులు నమోదు అయ్యాయి. 7 కోట్ల 91 లక్షల 944 మంది వైరస్‌ నుంచి జయించి కరోనా వారియర్‌గా నిలిచారు. మొత్తంగా రాష్ట్రంలో 4 వేల 111 మందిని కరోనా బలి తీసుకుంది. కొత్తగా నమోదు అయిన కేసుల్లో హైదరాబాద్‌లో 257, మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలో 37, సంగారెడ్డి జిల్లాలో 73, రంగారెడ్డి జిల్లాలో 58, ఖమ్మం జిల్లాలో 10 కేసులు బయట పడ్డాయి.

కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. నిబంధనలను కఠినతరం చేయాలని అధికారులను వైద్యారోగ్య శాఖ ఆదేశించింది. కరోనా టెస్టులను సైతం ముమ్మరం చేయాలని పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే మాస్క్ ధరించని వాహనదారులపై జరిమానాలు పడుతున్నాయి.

Also read: AP High Court: రఘురామ కృష్ణరాజుకు ఎదురుదెబ్బ..విచారణ ఎదుర్కోవాల్సిందేనన్న హైకోర్టు..!

Also read: Minister Harish Rao: కస్టమర్ చిరునామాల అప్‌డేట్‌పై దృష్టి పెట్టండి..జీఎస్టీ కౌన్సిల్‌లో మంత్రి హరీష్‌రావు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News