Congress Party Joinings: అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మళ్లీ పార్టీ ఫిరాయింపులను పునఃప్రారంభించింది. ఈసారి బీఆర్‌ఎస్ పార్టీతోపాటు బీజేపీకి భారీ షాక్ ఇచ్చింది. ఒకేసారి రెండు పార్టీలకు డబుల్ స్ట్రోక్ ఇచ్చింది. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, ఇతర ప్రతినిధులు కాంగ్రెస్ గూటికి చేరారు. ఆదిలాబాద్ నుంచి పార్టీ ఫిరాయింపులను మళ్లీ కొనసాగించింది. గాంధీభవన్ వేదికగా జరిగిన చేరికలతో కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్‌లోకి వచ్చింది.
Also Read: KTR Harish Rao Arrest: రేవంత్ రెడ్డి నీ పిట్ట బెదిరింపులకు భయపడం.. ప్రశ్నిస్తే కేసులా?
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బజ్జు సమక్షంలో గురువారం ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాబూరావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కులను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 'హరీశ్ రావు, కౌశిక్ రెడ్డి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటానంటే ఊరుకునేది లేదు. చట్టం ఎవరికి చుట్టం కాదు' అని స్పష్టం చేశారు. ఇష్టారాజ్యంగా అడ్డమైన భాషలో తిడతమంటే కుదరదని పేర్కొన్నారు. లీడర్ గా ఎదగాలని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
Also Read: KT Rama Rao: తప్పుడు కూతలు కూస్తోన్న రేవంత్ రెడ్డిని విడిచిపెట్టేది లేదు
'బీఆర్ఎస్ పార్టీ పది శాతం అభివృద్ధి ఇస్తే.. 10 నెలల్లో 100 శాతం అభివృద్ధిని కల్పించాం' అని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. 'కొంత మంది బీఆర్ఎస్ నాయకులు మాతో టచ్‌లో ఉన్నారు. మంచి రోజు చూసుకొని పార్టీలో చేరుతారని ప్రకటించారు. కాంగ్రెస్ పాలన నచ్చి తాను పార్టీలో చేరినట్లు బీజేపీ మాజీ ఎంపీ సోయం బాబురావు చెప్పారు. 'ఆదిలాబాద్‌లో అన్ని వర్గాల సమస్యల కోసం నా వంతు కృషి చేస్తా. ఆదివాసీ హక్కుల కోసం కాంగ్రెస్‌లో చేరా' అని మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు వెల్లడించారు.
ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం పార్టీలో చేరికలు చేసుకుంటున్నట్లు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తెలిపారు. 'పదవులు ఆశించి కాంగ్రెస్ పార్టీలోకి నాయకులు రావట్లేదు. అధికారంలోకి ఎవరు వచ్చినా మా ఆదివాసీలను అణగదొక్కే ప్రయత్నం చేశారు' అని విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ, బీజేపీల నుంచి అనూహ్యంగా చేరికలు జరగడం చర్చనీయాంశంగా మారింది. 'మాతో టచ్‌లో ఉన్నారు' అని ఇరు పార్టీల నాయకులపై వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ మేరకు చేరికలు జరగకపోవడంతో మాజీ ప్రజాప్రతినిధులు దిక్కయ్యారని చర్చ జరుగుతోంది. ఎవరూ పార్టీలో చేరే సాహసం చేయకపోతుండడంతో ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులకు కాంగ్రెస్ కండువాలు కప్పింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.