LRS scheme: ఎల్ఆర్ఎస్‌‌పై కోమటిరెడ్డి పిటిషన్

లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS) విషయంలో తెలంగాణ సర్కారు నిర్ణయాన్ని, విధానాలను సవాలు చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ( MP Komatireddy Venkat Reddy ) రాష్ట్ర హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Last Updated : Sep 23, 2020, 06:28 AM IST
LRS scheme: ఎల్ఆర్ఎస్‌‌పై కోమటిరెడ్డి పిటిషన్

హైదరాబాద్‌: లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS) విషయంలో తెలంగాణ సర్కారు నిర్ణయాన్ని, విధానాలను సవాలు చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ( MP Komatireddy Venkat Reddy ) రాష్ట్ర హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ కారణంగా పేద, మధ్య తరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎంపీ కోమటిరెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌ను రద్దు చేయాల్సిందిగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని ఎంపీ కోమటిరెడ్డి కోర్టుకు విజ్ఞప్తిచేశారు. Also read : COVID19: తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు

ఇదిలావుంటే, ఎల్‌ఆర్‌ఎస్‌‌పై  ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కూడా హైకోర్టులో ( TS High court ) ఓ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇవే కాకుండా ఇంకొంత మంది వ్యక్తులు వేర్వేరుగా పిటిషన్స్ దాఖలు చేసిన నేపథ్యంలో అన్ని పిటిషన్లను కలిపి కోర్టు ఒకేసారి విచారించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. Also read : KCR In Yadadri: కోతులకు అరటి పండ్లు పంచిన సీఎం కేసీఆర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News