CM Revanth Reddy: టీడీపీ-బీజేపీ పొత్తులపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్.. అతుకుల బొంత అంటూ సెటైర్లు

CM Revanth Reddy On BJP-TDP Alliance: లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామనే ధైర్యం ఉంటే.. మోదీ అన్ని రాష్ట్రాల్లో పొత్తులు ఎందుకు పెట్టుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మోదీని ఇంటికి పంపించేందుకు 140 కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Mar 9, 2024, 10:47 PM IST
CM Revanth Reddy: టీడీపీ-బీజేపీ పొత్తులపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్.. అతుకుల బొంత అంటూ సెటైర్లు

CM Revanth Reddy On BJP-TDP Alliance: ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎన్డీఏ అతుకుల బొంత అని విమర్శించారు. ప్రతి రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పొత్తులు పెట్టుకుంటున్నారని.. 400 సీట్లు వస్తాయని నమ్మకం ఉంటే పొత్తులు ఎందుకు..? అని ప్రశ్నించారు. ఏపీలో చంద్రబాబుతో పొత్తు కుదుర్చుకున్నారని.. 400 సీట్లు గెలిచేలా ఉంటే చంద్రబాబుతో పొత్తు ఎందుకు..? అన్నారు. మహారాష్ట్రలో శివసేనను, ఎన్సీపీ పార్టీలను చీల్చారని ఫైర్ అయ్యారు. మేడ్చల్ ప్రజా దీవెన సభలో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి మాట్లాడారు.

Also Read: Ap Elections 2024: ఏపీలో 2014 పొత్తులు రిపీట్, ఎవరికెన్ని సీట్లంటే

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడంతో గత పదేళ్లలో మేడ్చల్‌లో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలను వేగంగా పరిష్కారం అవుతున్నాయని చెప్పారు. కొందరు తమ ప్రభుత్వం ఆరు నెలల్లోనే కూలిపోతుందని అంటున్నారని.. తాము అల్లాటప్పాగా అధికారంలోకి వచ్చిన వాళ్లం కాదని అన్నారు. ఈ ప్రభుత్వాన్ని కూల్చేంత మొనగాడు ఎవడైనా ఉన్నాడా..? అంటూ ప్రశ్నించారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే తమ కార్యకర్తలు ఊరకోరని అన్నారు. తాము మంచివాళ్లం కాబట్టే మీరు ఇంకా తిరుగుతున్నారని.. కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే ఫామ్ హౌస్ గోడలు ఉండవని వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే తమను టచ్ చేసి చూడాలని అని సవాల్ విసిరారు.
  
ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని కవిత మాట్లాడుతున్నారని.. తాము భర్తీ చేసిన 30 వేల ఉద్యోగాల్లో 43 శాతం ఆడబిడ్డలకు ఇచ్చామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. లెక్కలతోపాటు పేర్లతో సహా చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ధర్నా చౌక్ వద్దన్న వాళ్లు.. ఇప్పుడు సిగ్గులేకుండా వెళ్లి ధర్నా చౌక్‌లో ధర్నా చేస్తున్నారని కవితను ఉద్దేశించి సెటైర్లు వేశారు. లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్టు మూడేళ్లకే కూలిపోయిందని విమర్శించారు. హరీశ్‌ రావు మేడిగడ్డకు రమ్మంటే రారని.. అసెంబ్లీలో మైక్ ఇస్తే మాట్లాడరని ఎద్దేవా చేశారు. మేడ్చల్ ప్రాంతానికి ఐటీ పరిశ్రమలు రావాలని.. ఇక్కడ భూముల విలువలు పెరగాలని అన్నారు.

కేంద్రంలో మోదీ పాలనకు ఇక కాలం చెల్లిందన్నారు. అక్రమ కేసులు పెట్టి వారితోనే మోదీ పొత్తులకు దిగుతున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో కేసీఆర్‌ను సాగనంపించినట్లే ఢిల్లీలో మోదీని సాగనంపించేందుకు 140 కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. 

Also Read: Indiramma Housing Scheme: ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు.. ఎప్పుడు.. ఎంతిస్తారంటే..? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News