CM Revanth Reddy: అసెంబ్లీకి రా స్వామి.. చర్చిద్దాం.. కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి ఆహ్వానం

CM Revanth Reddy Vs KCR: తాము పది నెలల్లోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని.. లెక్క తప్పితే క్షమాపణలు చెప్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలని.. రుణమాఫీపై లెక్కలు చూపిస్తామన్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Nov 20, 2024, 04:56 PM IST
CM Revanth Reddy: అసెంబ్లీకి రా స్వామి.. చర్చిద్దాం.. కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి ఆహ్వానం

CM Revanth Reddy Vs KCR: వేములవాడ రాజన్న సాక్షిగా అభివృద్ధికి శ్రీకారం చుట్టామని.. నవంబర్ 30వ తేదీలోపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్‌లపై సమీక్షించి పూర్తిచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశం అబ్బురపడేలా పాలించిన పీవీ కరీంనగర్ బిడ్డ అని.. తెలంగాణపై నాడు సోనియా ఈ గడ్డపైనే మాట ఇచ్చి.. నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ మాట ఇస్తే నిలబెట్టుకుంటుందని.. ఎంత త్యాగమైనా చేస్తుందన్నారు. బండి సంజయ్‌ను గెలిపిస్తే కరీంనగర్‌కు తెచ్చింది  ఏమిటి అని.. పార్లమెంట్‌లో ఇక్కడ గురించి మాట్లాడరా..? అని ప్రశ్నించారు. గతంలో  గెలిపించిన కేసీఆర్, వినోద్ తెచ్చింది శూన్యం అని.. కరీంనగర్‌లో  పెండింగ్ ప్రాజెక్ట్‌లు ఎందుకు పూర్తి చేయలేదు..? అని నిలదీశారు. కాంగ్రెస్ గెలవకపోయినా సరే సిరిసిల్లను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రత్గ్యేక బోర్డు తెస్తామని ప్రకటించారు.

Also Read: Gold News: పెళ్లిళ్ల సీజన్ ముందు సీన్ రివర్స్.. పసిడి ప్రియులకు బిగ్ షాక్..మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర..ఎంత పెరిగిందంటే
 
"తండ్రి, కొడుకు, అల్లుడు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. పదేళ్లు చేయలేనిది చేస్తుంటే.. కడుపు నొప్పి. సోషల్ మీడియాలో నాలుగు హవులా మాటలు పెట్టి సంతోషపడుతున్నారు. కేసీఆర్.. ధైర్యం ఉంటే అసెంబ్లీకి రా.. రుణమాఫీపై లెక్క చూపుతాం. పది నెలల్లో 50 వేల ఉద్యోగాలిచ్చాం.. లెక్క తప్పతే.. అక్కడే క్షమాపణ చెబుతా.. కేసీఆర్ ఎల్బీ స్టేడియం రాకా.. లెక్క పెట్టుకో.. సచ్చిన బర్రె పగిలిన కుండెడు పాలు ఇచ్చింది అన్నట్లు.. చిల్లర మాటలు మాట్లాడుతున్నారు.

కోటి యాబై లక్షల టన్నులు వరి పండింది. కాళేశ్వరం నుంచి చుక్క నీరు వాడలేదు.. దీనికి ఏం చెబుతావు కేసీఆర్.. కాళేశ్వరంలో లక్ష కోట్లు మింగినా ఒక్క సుక్క నీరు రాలేదు.. ఏ ప్రాజెక్ట్ పూర్తిచేశావో కేసీఆర్ చెబుతారా..? రంగనాయక ప్రాజెక్ట్‌ భూసేకరణ భూమిలో హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టారు.. నీ లెక్క తీస్తున్నా. మల్లన్న సాగర్ నీళ్లు కేసీఆర్‌ ఫామ్ హౌస్ తీసుకువెళ్లారు.. ఇది నిజం కదా..? డ్రగ్స్ తీసుకున్నోడిని పట్టుకోవద్దట.. బామ్మర్ది కళ్లల్లో ఆనందానికి బావ వద్దంటున్నాడు. పేదల కోసం ఒక చట్టం.. బీఆర్ఎస్‌లకు చట్టం వేరా..?

కొడంగల్ అభివృద్ధి చేయాలని చూస్తే.. రౌడీలతో కలెక్టర్‌ను కొట్టించారు. కొడుకు, అల్లుడు మాటలను కేసీఆర్ సమర్థిస్తున్నారా..? పరిశ్రమలు, భూసేకరణ వద్దా..? కేసీఆర్ చెప్పాలి. సీఎంగా కృతజ్ఞత చాటుకోవాలని అభివృద్ధి చేయాలకున్నా.. తప్పా..? కొడంగల్‌పై ఎందుకు కక్ష కట్టావు కేసీఆర్..? కుట్రలు చేసిన కేటీఆర్ ఊచలు లెక్కపెట్టాల్సిందే. కేటీఆర్ ఉరుకులాడుతున్నాడు అంత చూస్తున్నా.. ఎనబై వేల పుస్తకాలు చదిందేంటో చెప్పు కేసీఆర్. అసెంబ్లీకి రా స్వామి.. చర్చిద్దాం. అభివృద్ధి జరగాలంటే ఎవరో వొకరు భూమి కోల్పోవాల్సిందే. నిర్వాసితులకు నష్టపరిహారం అత్యధికంగా ఇవ్వాలని చట్టాన్ని సవరిస్తున్నాం. భూమితో ఉండే సెంటిమెంట్ నాకు తెలుసు. భూమిని కోల్పోతున్న వారికి అత్యధికంగా నష్టపరిహారం ఇస్తాం." అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Also read: School Holidays 2024: ఇవాళ నవంబర్ 20 నుంచి ఈ రాష్ట్రాల్లో స్కూళ్లకు నిరవధిక సెలవులు, ఎక్కడెక్కడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News